మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు.కాకాణికి ఏ మాత్రం సిగ్గు, మానవత్వం ఉంటే వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.నెల్లూరు కోర్టులో దస్త్రాల అపహరణ కేసును సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఘోరమైన నేరాలు చేసే కాకాణిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి.రాష్ట్ర పోలీసు వ్యవస్థలపై తమకు నమ్మకం లేదని కోర్టు కూడా చెప్పినట్లైంది.
సీబీఐ తమ విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నా.మాయమైన దస్త్రం ఫిర్యాదుదారుడిని నేనే కాబట్టి నా అభిప్రాయమూ సీబీఐ తీసుకోవాలి.
వివేకా హత్య కేసులా నాన్చకుండా, న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠగా ఈ కేసును సీబీఐ తీసుకోవాలి.జిల్లా ఎస్పీ సహా స్థానిక అధికారుల్ని తప్పించి.
న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలి.తప్పుడు డాక్యుమెంట్లతో నాపై కాకాణి చేసిన అసత్య ఆరోపణలపై నేనే కాకాణి మీద కేసు పెట్టా.
కాకాణి చూపించింది తప్పుడు పత్రాలని విచారణలో తేలి ముగ్గురు అరెస్టయ్యారు కూడా.కేసు కీలకదశలో ఉండగా కాకాణి మంత్రి అవ్వటం.
మరుసటి రోజే కేసు దస్త్రాలు పోవటం జరిగింది.కోర్టులో ఉన్న 4 వేల దస్త్రాల్లో ఒక్క కాకాణి దస్త్రమే కుక్క అరుపులు వల్ల పోయిందట అని పోలీసుల ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై సోమిరెడ్డి వ్యంగ్యస్త్రాలు సంధించారు.