ఆ రెండు ఎన్నికలూ ఒకేసారి ! టీడీపీ ప్లాన్ ఇదే !       2018-06-23   01:10:00  IST  Bhanu C

దేశంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి అనే వార్తలు అన్ని రాజకీయ పార్టీల్లో కలవరం పుట్టిస్తున్నాయి. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం ఈ కొత్త ప్రదిపాదన తీసుకోచ్చిది. అయితే ఇది అమలవుతుందా .. లేదా అనే విషయాన్ని పక్కనపెడితే పార్టీల్లో మాత్రం ఎందుకైనా మంచిది అన్నిటికి సిద్దంగా ఉంటేనే బెటర్ అన్న ధోరణి కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికల వలన బీజేపీ బాగా లబ్ది పొందవచ్చని చూస్తోంది.

కేంద్రం ఆలోచన అలా ఉందంటే మన హైటెక్ సీయం చంద్రబాబు నాయుడు ఊరుకుంటాడా .. అది కుడా తనకు కలిసివచ్చేలా వ్యూహం పన్నెసాడు. పనిలో పనిగా ముందస్తు ఎన్నికలకు … పంచాయతీలకు కూడా కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించబోతున్నాం అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో చంద్రబాబునాయుడు ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగానే.. పార్లమెంటు, అసెంబ్లీకి తోడుగా పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఒకేసారి వచ్చేస్తాయని ఆయన చెప్పారు. అందరు దీనికి తగ్గట్టుగా సిద్దంగా ఉండాలని సూచించాడు.

వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది ఆగస్టులోగానే పూర్తి కావాల్సి ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల టీడీపీ బాగానే లాభపడింది. కానీ ఇప్పుడు మాత్రం సమయానికి ఎన్నికలు నిర్వహిస్తే అది ఎక్కడ కొంప ముంచుతుందో అనే ఆందోళన ఎక్కువ టీడీపీలో కనిపిస్తోంది.

ఇక తెలంగాణా సీయం ఈ విషయంలో కొంచెం దూకుడుగా ఉండడం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. అక్కడ సరైన సమయంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కెసిఆర్ సిద్దం అవుతున్నాడు. ఈ దశలో ఏపీలో పంచాయతి ఎన్నికలు వాయిదా వేస్తే రాజకీయంగా దెబ్బతినడం.. టీడీపీ ఎన్నికలంటే భయపడుతోందని ప్రత్యర్ధులు ఆరోపణలు గుప్పించే అవకాశం ఉండడంతో బాబు కుడా డైలమాలో పడ్డాడు. అందుకే.. సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే… స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తాం అంటూ బాబు కొత్త రాగం అందుకున్నాడు. ఇప్పటికే టీడీపీ గ్రామ కమిటీల ద్వారా ప్రభుత్వం ఎక్కడ లేని అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ దశలో స్థానిక సంస్థల ఎన్నికలంటేనే టీడీపీ భయపడుతోంది.