ఆ టీడీపీ ఫైర్‌బ్రాండ్ సైలెన్స్ సైలెన్స్... వైసీపీతో లాలూచీయా..!

ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో విప‌క్ష టీడీపీకి కేవ‌లం 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు.వీరిలో కూడా ముగ్గురు ఇప్ప‌టికే పార్టీకి దూరం కావ‌డంతో ఇప్పుడు ఆ పార్టీలో చంద్ర‌బాబు, బాల‌య్య‌ను ప‌క్క‌న పెడితే 18 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్న‌ట్టు లెక్క‌.

 Tdp Fire Brand Silence In Tdp And Connection With Ysrcp,  Tdp, Ysrcp, Jagan, Cha-TeluguStop.com

వీరిలో కూడా కొంద‌రు ఎమ్మెల్యేలు ఊగిస‌లాట ధోర‌ణితోనే ఉన్నార‌ని అంటున్నారు.ఇదిలా ఉంటే టీడీపీకి అత్యంత విశ్వాస‌పాత్రుడు, చంద్ర‌బాబుకు స‌న్నిహితుడు అయిన ఓ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు సొంత పార్టీ నేత‌ల్లోనే అనేక సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.

విచిత్రం ఏంటంటే ప్ర‌తిసారి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు గెలుస్తూ.పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఓడిపోతోన్న 2014లో ఓడి మొన్న ఏపీలో మ‌హామ‌హులు అయిన నేత‌లు ఓడినా ఆయ‌న మాత్రం గెలిచారు.

పార్టీకి ఐదేళ్ల వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వులు వ‌చ్చే ప‌రిస్థితి లేదు.అయితే ఏకైక కేబినెట్ ర్యాంక్ ప‌ద‌వి ఉన్న బీఏసీ ప‌ద‌విని కూడా చంద్ర‌బాబు కేశ‌వ్‌కే క‌ట్ట‌బెట్టారు.

ఈ ప‌ద‌విని బాబు త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన నేత‌కు ఇచ్చార‌ని విమ‌ర్శలు వ‌చ్చినా బాబు కేశ‌వ్‌కే ఇచ్చారు.

Telugu @ncbn, Chandrababu, Jagan, Jc, Lokesh, Ysrajashekar, Ysrcp-Telugu Politic

అయితే కేశ‌వ్ గ‌త యేడాది కాలంగా అసెంబ్లీలోనూ, బ‌య‌టా ఏపీ సీఎం జ‌గ‌న్‌ను కాని.ఆయ‌న పార్టీని కూడా ఎంత మాత్రం విమ‌ర్శించ‌డం లేదు.జేసీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు లోకేష్ తాడిప‌త్రి వ‌చ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌న‌కు  దూరంగా ఉన్నారు.

కేశవ్ బాబు తీరుపై గుర్రుగా ఉన్నార‌ని.పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న సైలెంట్ అయ్యార‌ని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే పార్టీ గెలిచిన‌ప్పుడు కేశ‌వ్ ఓడినా బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.ఆ త‌ర్వాత రెండునరేళ్ల త‌ర్వాత అయినా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నా ఇవ్వ‌లేదు.

ఇక కేశ‌వ్‌కు తెలంగాణ‌లో అధికార పార్టీ నేత‌ల‌తో వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయ‌ని.ఈ క్ర‌మంలోనే ఆయ‌న లాలూచీ రాజ‌కీయం చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు కూడా వినిపిస్తున్నాయి.ఏదేమైనా కేశ‌వ్ పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి లాంటి వాళ్ల‌నే త‌న మాట‌ల‌తో ఢీకొట్టేవారు.అలాంటి నేత ఇప్పుడు మౌన‌వ్ర‌తం చేయ‌డం అనేక సందేహాల‌కు కార‌ణ‌మైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube