కోడెల కుటుంబంపై కేసులు ! టీడీపీ పట్టించుకోదా ?  

Tdp Party Not Intrested In Kodela Sivaprasad Case-kodela Sivaprasad,kodela Sivaprasad Daughter And Son,tdp,ycp

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు, ఆయన కుమారుడు, కుమార్తె మీద కేసులు నమోదయ్యాయి. ఇంకా అనేకమంది తాము కూడా బాధితులమే అంటూ అనేకమంది పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు అవుతూ ఉన్నాయి..

కోడెల కుటుంబంపై కేసులు ! టీడీపీ పట్టించుకోదా ? -Tdp Party Not Intrested In Kodela Sivaprasad Case

ఈ కేసుల పరిష్కారానికి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఈ వ్యవహారాల్లో కోడెల ఫ్యామిలీ ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. అయినా చోటామోటా స్థానిక నాయాలుకులు తప్ప టీడీపీ తరఫునుంచి ఈ వ్యవహారాన్ని ఖండించి కోడెల కుటుంబానికి అండగా నిలిచే నాయకులు ప్రస్తుతానికి కరువయ్యారు.

ఏపీ అసెంబ్లీ సమావేశంలో కూడా వేరే వేరే విషయాల మీద ప్రతిపక్ష తెలుగుదేశం అధికార పార్టీ మీద విమర్శలు చేసింది కానీ కోడెల మీద కేసుల వ్యవహారాన్ని ప్రస్తావించకపోవడం ఆయన అనుచరుల్లో అనుమానం రేకెత్తిస్తోంది. అయితే ఓడిపోయిన తెలుగుదేశం నేతలు మాత్రం ఈ విషయంలో పార్టీ తరపున డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట. రాజకీయంగా టీడీపీ నాయకులను వేధించేందుకే వైసీపీ కుట్ర చేస్తోందని గట్టిగా వాదించి ఈ విషయాన్ని రచ్చ చేయాలని చూశారట. అయితే ఈ విషయంలో కొంతమంది టీడీపీ నాయకులు వారిని వారించారట.

కోడెల కూతురు, కొడుకు అవినీతి వ్యవహారాలపై పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అనేక ఫిర్యాదులు వచ్చాయని, కానీ అప్పుడు ఏ చర్యలు తీసుకోకపోగా, ఇప్పుడు ఆ విషయంలో వారి తరపున వకాంతా పుచ్చుకుంటే పోయేది పార్టీ పరువే అని టీడీపీకి చెందిన కొంతమంది వాదించినట్టు సమాచారం.ఇక పార్టీ అధినేత చంద్రబాబు కూడా కోడెల వ్యవహారంలో తల దూర్చకపోతేనే మంచిది అన్నట్టుగా తప్పించుకునే ధోరణి ఆవలంభించడం కోడెల ఫ్యామిలీకి రుచించడంలేదట.