జనసేన.. లోకి టీడీపీ కీలక నేతలు.  

ఒక పక్క ఏపీలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది ఏ పార్టీకి తగ్గట్టుగా ఆ పార్టీలు రాజకీయ వ్యూహ రచనలు చేస్తూ ఉన్నాయి…మరో పక్క ప్రధాన అధికార పార్టీ అయిన తెలుగుదేశం అటు కేంద్రం తో ఇటు వైసీపీ, జనసేనలపై విమర్శలు చేస్తూ పాలనని పక్కన పెట్టేసాయని ఈ క్రమంలో వైసీపీ ,జనసేన పార్టీలు ప్రజలలోకి వెళ్తూ తెలుగుదేశం పార్టీని వెనక్కు నెట్టేశాయని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు కూడా..అయితే టీడీపీ కంటే కూడా జనసేన ,వైసీపీలో ముందంజ లో ఉండటంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు పార్టీ జంప్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..

TDP Party Leaders Joining In To Janasena Party-

TDP Party Leaders Joining In To Janasena Party

ముఖ్యంగా నియోజకవర్గాల పెంపు లేకపోవడంతో టీడీపీ కి వచ్చే కాలం గడ్డు పరిస్థితేనని అంటున్నారు..అయితే ఈ క్రమంలో తీదీపీలోని ఇద్దరు మంత్రులు జనసేన లోకి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారని టాక్ హల్చల్ చేస్తోంది..ఎన్నికలకు మరో ఆరేడు మాసాల గడువు ఉన్నప్పటికీ.. నేతలు ఇప్పటి నుంచే తమ టికెట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ ఉండబట్టి బాబు ఆటలు సాగాయని ఈ సారి ఇద్దరు దూరం అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమే అంటున్నారు సొంత పార్టీ నేతలు..ఇదిలాఉంటే..దీపం ఉండగానే చక్కబెట్టుకునే రీతిలో కొందరు నేతలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు.

అందులో భాగంగానే జనసేన లోకి జంప్ అవ్వడానికి రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది..వారు ఇరువురూ ఇప్పటికే తమ సీట్ల విషయానికి సంబంధించి జనసేనాని నుంచి తగిన విధంగా హామీ పొందారని ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము సిద్దమే అనే సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది..అయితే బాబు కేబినెట్ నుంచీ జంప్ అయ్యే మంత్రులలో ఒకరు రాజధాని ప్రాంతానికి చెందిన వారు కాగా..మరొకరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారని సమాచారం అందుతోంది..అంతేకాదు వైసీపీ నుంచీ టీడీపీలోకి జంప్ అయిన కొందరు ఎమ్మెల్యేలు సైతం బాబు కి ఘలక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది..

TDP Party Leaders Joining In To Janasena Party-

ఇదిలాఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మేనిఫెస్టో ని చూచాయిగా విడుదల చేయడం తో పాటు ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత కూడా ఇచ్చిన హామీల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వలేదు…కానీ పవన్ మాత్రం తాను ఇస్తున్న ఎన్నికల హామీలను ఏ విధంగా నెరవేరుస్తానో అనే విషయాన్ని చెప్పుకొస్తున్నాడు…దాంతో పవన్ దూకుడు చూసి రాజకీయ పరిసీలకులే అవ్వాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది..దాంతో ప్రజలలో అటు ఇతర పార్టీల నాయకుల్లో పవన్ పై నమ్మకం పెరిగిపోయింది దాంతో సామాన్యుల నుంచీ నాయకులు వరకూ పవన్ పార్టీలోకి చెరడానికి సిద్దం అవుతున్నారు..