ఆమ్మో ఆగస్ట్ : కలవరపెడుతున్న బాబు  

Tdp Party Afraid Of August Month-chandrababu,jagan,tdp,ycp,ఆగస్ట్,తెలుగుదేశం పార్టీ

తెలుగుదేశం పార్టీకి ఆగస్ట్ నెల అస్సలు అచ్చిరాదు. ఎందుకంటే రెండు సార్లు ఆగస్ట్ నెలలో సంక్షోభానికి గురయ్యి నాయకత్వం మార్పు జరిగింది.అందుకే తెలుగుదేశం పార్టీకి ఆగష్ట్ అంటే భయం..

ఆమ్మో ఆగస్ట్ : కలవరపెడుతున్న బాబు -TDP Party Afraid Of August Month

ఏదో ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక కుదుపు ఆ ఆ నెలలో టీడీపీకి తగులుతూనే ఉంటుంది. అందుకే చిన్న స్థాయి కార్యకర్త నుంచి అధినేత వరకు అంతా ఆగస్ట్ వస్తుందంటే చాలు వణికిపోతుంటారు. ప్రస్తుతం టీడీపీ ఏపీలో అధికారంలో లేదు.

అయినా రాబోయే ఆగస్ట్ ను తలుచుకుని అధినేత చంద్రబాబు భయాందోళన చెందుతున్నట్టు పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఒకవైపు పార్టీకి అధికారం పోయింది అని కుమిలిపోతున్న బాబు టీడీపీ భవిష్యత్తును తలుచుకుని ఎక్కడలేని ఆందోళన చెందుతున్నాడు. అత్యధిక స్థానాలను సాధించిన వైసీపీని రాజకీయంగా ఈ ఐదేళ్లపాటు ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతం అయిపోతున్నాడట.

ప్రస్తుతం ఏపీలో జగన్ మార్క్ పరిపాలన ప్రారంభమైంది. అందరిచేత శభాష్ అనిపించుకునేలా ప్రస్తుతానికి జగన్ పరిపాలన స్టార్ట్ అయినట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే టీడీపీ నాయకులు వైసీపీ వైపు చూస్తున్నట్టు వస్తున్న వార్తలు బాబు లో కలవరం పెంచుతున్నాయి.

వైసీపీ వైపు వెళ్లడం ఇష్టంలేని మరి కొందరయితే కేంద్ర అధికార పార్టీ బీజేపీ వైపు చూస్తున్నారట. అయితే వీరంతా ఇప్పటికిప్పుడు పార్టీ మారకపోయినా రానున్న రెండు నెలల్లో పెద్ద ఎత్తున వైసీపీ, బీజేపీ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారని బాబు దృష్టికి వచ్చింది. అందుకే ఈ రెండు నెలల వెయిటింగ్ టైమ్ చంద్రబాబుకు నిద్రపట్టనివ్వడం లేదు.

ఎందుకంటే ఈ రెండు నెలలు గడిస్తే వచ్చేది ఆగస్ట్‌. ఆ నెల పేరు తలుచుకుంటే చాలు టీడీపీ నేతలకు వణుకు పుడుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ నెలలోనే తెలుగుదేశం అనేక సంక్షోభాలు చవిచూసింది. కొత్త ప్రభుత్వం కూడా ఆగస్ట్ నెలలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించేలా కనిపిస్తోంది.

అందుకే ఈ ఎన్నికల సమయంలోనే పార్టీ మారితే తమకు అన్ని విధాలా కలిసొస్తుందని టీడీపీ నాయకులు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లాల్లో కీలక నాయకుడిగా ఉన్న జేసీ ఫ్యామిలీ బీజేపీ వైపు వెళ్లేందుకు స్కెచ్ వేసుకుంటోంది. ఈయనతో పాటు టీడీపీలో పెద్ద తలకాయలు, జగన్ అంటే భయపడుతున్న మరికొంతమంది షెల్టర్ జోన్ లా బీజేపీని వాడుకునేందుకు ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారట..