ఫ్యాన్ కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగింది.. నారా లోకేష్

Tdp Nara Lokesh Satirical Comments On Ycp Government

రాష్ట్రంలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్ గా మార్చారు అని విమర్శించారు.రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతల గురించి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఓవైపు విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నరన్నారు.మరోవైపు విద్యుత్ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

 Tdp Nara Lokesh Satirical Comments On Ycp Government-TeluguStop.com

బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజులు ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన సీఎం జగన్ లో చలనం లేదని దెప్పిపొడిచారు.బొగ్గు ఉత్పత్తి సంస్థలకు రూ.(215) రెండు వందల పదిహేను కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో దారుణమన్నారు.అవసరం మేర బొగ్గు నిల్వచేసుకోవాలి అన్నా కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.

విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టని ప్రభుత్వం ప్రతిపక్షాలపై అనవసర రాద్ధాంతం చేస్తుందని లోకేష్ విమర్శించారు.

 Tdp Nara Lokesh Satirical Comments On Ycp Government-ఫ్యాన్ కు ఓటేస్తే.. ఇంట్లో ఫ్యాన్ ఆగింది.. నారా లోకేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై లోకేష్ విరుచుకుపడ్డారు.

 ఫ్యాన్ కు ఓటేస్తే. ఇంట్లో ఫ్యాన్ ఆగింది. రాష్ట్రంలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు.రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్ గా మార్చారు అని విమర్శించారు.రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతల గురించి ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

#AP Cuts #Fan Symbol #CMJagan #Problems #TDP Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube