వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్రస్థాయిలో సీరియస్ అయిన నారా లోకేష్..!!

తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ గత కొన్ని రోజుల నుండి ఏపీ అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.పరీక్షల విషయంలో ఆ తర్వాత కర్నూలు జిల్లాలో టిడిపి పార్టీ కార్యకర్త మరణించిన టైంలో నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 Tdp Nara Lokesh Is Once Again Seriously Serious About The Ycp Government-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద తమకు న్యాయం చేయాలని తల్లి కొడుకు ఆత్మహత్యయత్నం ఘటనకు సంబంధించిన వార్త దినపత్రికలో రావడంతో లోకేష్ స్పందించడం జరిగింది.తల్లి కొడుకు పై దాడికి పాల్పడిన అధికార పార్టీ నేతల ను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో సీరియస్ అయ్యారు.

లోకేష్ ఏమన్నారంటే…’వైఎస్ జ‌గ‌న్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యే శరణ్యం అనే దారుణమైన పరిస్థితి దాపరించింది.కాకినాడ కలెక్టరేట్ ముందు ఒక తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నం చేశారంటే వైకాపా రాక్షసులు ఎంతగా రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు’ అని విమ‌ర్శించారు.‘కాకినాడకు చెందిన కుంచె నాని అనే మహిళ ఇల్లు కబ్జా చెయ్యడమే కాకుండా కుటుంబంపై దాడి చేశాడు స్థానిక వైకాపా నేత బి.రాజు.ఫిర్యాదు చేస్తే మహిళకు న్యాయం చెయ్యాల్సింది పోయి దాడి చేసిన వ్యక్తికే పోలీసులు వత్తాసు పలకడం అన్యాయం’ అని పేర్కొన్నారు.

 Tdp Nara Lokesh Is Once Again Seriously Serious About The Ycp Government-వైసీపీ ప్రభుత్వం పై మరోసారి తీవ్రస్థాయిలో సీరియస్ అయిన నారా లోకేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Jagan, Kakinada, Kunche Nani, Kurnool District, Murder, Nara Lokesh, Tdp Activists, Ycp Leader B Raju-Telugu Political News

‘తక్షణమే అధికారులు స్పందించి బాధిత మహిళకు న్యాయం చెయ్యాలి.దాడికి పాల్పడిన వైకాపా నేత, అనుచరులను కఠినంగా శిక్షించాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు.

#Tdp Activists #AP CM Jagan #Kunche Nani #Nara Lokesh #Kakinada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు