ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఎప్పటిలాగే కొనసాగించాలి.. నారా లోకేష్

మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన.దుగ్గిరాల మండలం చిలువూరులో పర్యటించిన నారా లోకేష్.

 Tdp Nara Lokesh Demands To Continue Aided Schools As It Is-TeluguStop.com

కేవిఎస్ హై స్కూల్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.ప్రభుత్వం మా స్కూల్ ని ప్రైవేటీకరణ చెయ్యడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నాం.

కొంత మంది విద్యార్థులు ఇప్పటికే ఇతర స్కూల్లలో చేరిపోయారు.ఎయిడెడ్ స్కూల్లలో ఫీజులు తక్కువ ఉండేవి, ప్రైవేటీకరణ అవ్వడం వలన మేము విద్యకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది.

 Tdp Nara Lokesh Demands To Continue Aided Schools As It Is-ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఎప్పటిలాగే కొనసాగించాలి.. నారా లోకేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మా తల్లిదండ్రులు పెరిగిన ఫీజులు కట్టలేమని అంటున్నారు.

మాకు ఎయిడెడ్ స్కూల్లు ఉండాలి.

ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం మాకు కష్టంగా మారుతుంది.ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ఎప్పటిలాగే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

కేవీఎస్ ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులు లక్ష్మీ చైతన్య, చాందిని, నస్రీన్.ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ప్రభుత్వం 19,42,50,51 నాలుగు జిఓ లు తీసుకొచ్చింది.

ఎయిడెడ్ విద్యా వ్యవస్థ పేద విద్యార్థుల పాలిట వరం.ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఆఖరికి సీఎం గారి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కూడా ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనే చదువుకున్నారు.శాసనసభ, మండలి, బయట కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం.

Telugu Aided Schools, Continue Aided Schools, Demands, Jagan Government, Kvs High School Students, Mangalagiri Constituency, Tdp, Tdp Nara Lokesh, Ycp Government-Political

ప్రభుత్వాలు విద్య కోసం ఎంత ఖర్చు చేసినా తక్కువే.ఎయిడెడ్ విద్యా వ్యవస్థ కోసం కేవలం ఏడాదికి రూ.100% ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.ఆ ఖర్చు కూడా భారం అయ్యిందని అనడం మంచి పరిణామం కాదు.ఆస్తుల పై కన్నేసి తెచ్చిన జిఓలు రద్దు చేసే వరకూ పోరాడతాం.ఆప్షన్ల డ్రామా ఆపి జిఓ లు వెనక్కి తీసుకోవాలి.రాబోయే 20 ఏళ్లలో దేశం ఎంతో వేగంగా అభివృద్ధి చెందబోతుంది.

అందులో నేటి తరం విద్యార్థులు, యువత ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు.అందరూ బాగా చదువుకోవాలి.

ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించాలి.

#TDP Lokesh #Aided Schools #Jagan #Aided Schools #Kvs School

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube