బస్సుయాత్ర ప్లాన్ లో నారా భువనేశ్వరి ? 

టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Chandrababu Skill Development Scam ) లో అరెస్ట్ అయ్యి రెండు రోజులు దాటుతోంది.చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 Tdp Nara Bhuvaneswari Meluko Telugoda Bus Yatra,nara Lokesh, Nara Brahmani,nara-TeluguStop.com

వైసిపి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి చంద్రబాబును అరెస్టు చేయించిందని, ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకువెళ్లేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది.ఇక చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) దగ్గర నుంచి ఆయన నారా భువనేశ్వరి తో పాటు , కోడలు బ్రాహ్మణి రాజమండ్రిలోనే మకాం వేశారు.

ఇక చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చంద్రబాబు అరెస్టు తరువాత నుంచి ఢిల్లీలోనే మకాం వేశారు.ఆయనను కూడా ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో అరెస్టు చేసే అవకాశం ఉండడం ఇప్పటికే సిఐడి అధికారులు లోకేష్( Nara Lokesh ) కు నోటీసులు ఇవ్వడం వంటి పరిణామాలతో పార్టీ వ్యవహారాలు ప్రస్తుతం నారా భువనేశ్వరి చూస్తున్నారు.

Telugu Chandrababu, Bhuvaneswari, Brahmani, Lokesh, Skill Scam, Yuvagalam-Politi

ఐటి ఉద్యోగులు, యువత లక్ష్యంగా బ్రాహ్మణి( Nara Brahmani ) టిడిపికి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తుండగా,  పార్టీలోని కీలక నేతలను కలుస్తూ ముందు ముందు అనుసరించాల్సిన వ్యూహాల పై భువనేశ్వరి చర్చిస్తున్నారు .చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చేవరకు యాక్టివ్ ఉండాల్సిందేనని భువనేశ్వరి( Nara Bhuvaneswari ) డిసైడ్ అయిపోయారు.మరోవైపు చూస్తే ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది .ప్రస్తుతం చంద్రబాబు,  లోకేష్ అందుబాటులో లేకపోవడంతో అన్ని వ్యవహారాలను చక్కబడుతున్న భువనేశ్వరి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Telugu Chandrababu, Bhuvaneswari, Brahmani, Lokesh, Skill Scam, Yuvagalam-Politi

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లోనూ బస్సు యాత్రలు( Nara Bhuvaneswari Bus Yatra ) చేసి చంద్రబాబు కు జనాలు మద్దతు కూడగట్టాలని భువనేశ్వరి నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ప్రజలకు,  నాయకులకు దగ్గర అవడమే కాకుండా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ప్రజల్లో సెంటిమెంట్ ను రగిలించి వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలోకి దానిని మార్చుకోవాలనే వ్యూహంతో భువనేశ్వరి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube