నెక్ష్ట్ టార్గెట్ మురళీ మోహన్ ? భారీ జరిమానా వెనుక ? 

తెలుగుదేశం పార్టీలో ఒక మోస్తరు కీలక నాయకులు అందరూ ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇప్పటికే అనేక మంది వైసీపీ ప్రభుత్వం టార్గెట్ కు గురయ్యారు.

 Murali Mohan Is Going To Be The Target Of The Ycp Government , Ap, Cbn, Jagan, J-TeluguStop.com

  గత టిడిపి ప్రభుత్వంలో సదరు నేతలు చేసిన అవినీతి వ్యవహారాలు, స్కాం లు , వివాదాలు ఇలా ఏ అంశమైనా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాటన్నిటినీ బయటకు తీసి, విచారణ చేయిస్తూ,  సదరు నేతలను జైలుపాలు చేయడం,  ఆర్థికంగా దెబ్బ తీయడం చేస్తున్నట్లు గానే వ్యవహరిస్తోంది.  దీని కారణంగానే టిడిపి నేతలు పార్టీలో యాక్టివ్ గా ఉండేందుకు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.

ఇదే విధంగా టిడిపి మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ చాలా కాలంగా పార్టీ లో ఉన్నా, లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు .అయినా టీడీపీకి ఆర్థిక అండదండలు అందించడంలో ఆయన కీలక వ్యక్తి అనే విషయం వైసిపి గుర్తించింది.దీనికి తగ్గట్లుగానే కొన్ని తప్పులు కూడా టిడిపి నేతల నుంచి ఉండటంతో , సులువుగా ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు.

తాజాగా మురళీమోహన్ కు చెందిన జయభేరి కన్స్ట్రక్షన్ సంస్థకు భారీగా అధికారులు పెనాల్టీ విధించారు.

దీనికి కారణం తాడేపల్లి మండలం కుంచనపల్లి లో ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా నిర్మాణాలు చేపట్టిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కు కోటి రూపాయల ల్యాండ్ కన్వర్షన్ ఫీజు తో పాటు,  50 లక్షల జరిమానాను విధించారు.అయితే ఇందులో సంస్థ తప్పిదం ఉండడంతో వెంటనే జరిమానాను సదరు కంపెనీ అధికారులు చెల్లించేశారట.

విషయం ఏమిటంటే కుంచనపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న 7 ఎకరాల 5 సెంట్లు కొనుగోలు చేసి 2016 నిర్మాణాలు జయభేరి కన్స్ట్రక్షన్స్  చేపట్టింది.కాకపోతే అది వ్యవసాయ భూమి,  దానిని కమర్షియల్ ల్యాండ్ గా మార్చుకుని నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కోటి రూపాయల ఫీజు తో పాటు,  50 లక్షల పెనాల్టీ ని విధించారు.

Telugu Andhra, Jagan, Jayaberi, Magantimurali, Crore Fee, Rajamundry, Tdp Ycp, Y

  అయితే ఇక్కడితో ఇది ఆగదని,  మొత్తం మురళీమోహన్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల పైన వైసిపి దృష్టి సారించిందని,  త్వరలోనే ఆయన టార్గెట్ కాబోతున్నారనే విషయం ఇప్పుడు టిడిపిలో చర్చనీయాంశంగా మారింది.అయితే ఆయన టీడీపీ లోనే ఉన్న యాక్టివ్ గా లేరు.2019 ఎన్నికల దగ్గర నుంచి ఆయన టిడిపి తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.రాజకీయంగా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు .అయినా ఇప్పుడు ఆయనను వైసిపి టార్గెట్ చేస్తున్నట్లుగా వ్యవహరించడం వెనుక టీడీపీకి ఆర్థిక అండదండలు లేకుండా చేసే ఉద్దేశం గానే కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube