వైసీపీని అభినందించిన టీడీపీ ఎంపీ !   TDP MP Who Congratulated Ysr Congress Party     2018-10-16   15:51:01  IST  Sai M

‘తితలీ’ తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. సినీ హీరోల నుంచి … పారిశ్రామికవేత్తల వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోమవారం కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆ పార్టీ పేర్కొంది.

వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి’’ అని శ్రీకాకుళం ఎంపీ కోరారు.