షాకింగ్ న్యూస్....“జనసేన లోకి సుజనా”..?       2018-05-20   23:41:13  IST  Bhanu C

కర్ణాటక ఎనికల తరువాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతాయని ముందుగానే ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది ఈ విషయం అందరికి విదితమే..చంద్రబాబుని దెబ్బ కొట్టడం ద్వారా తన చుట్టూ ఉన్న నాయకులలో భయాన్ని కలిగించి పార్టీ నుంచీ ఒక్కొక్కరుగా జంప్ అయ్యేలా చేయాలనేది బీజేపి ఎత్తుగడ గా తెలుస్తోంది..అయితే ఈ మేరకి పనులు చాప కింద నీరులా చక చకా జరిగిపోతున్నాయట..ఈ క్రమంలోనే పేరు మోసిన బడా నాయకులని బీజేపి తనకి మద్దతు తెలుపుతున్న వైసీపి ,జనసేన పార్టీలలోకి పంపడానికి పక్కా ప్లాన్ సిద్దం చేసి ఉంచిందని తెలుస్తోంది..అయితే ముందుగా టీడీపీ నుంచీ జనసేన లోకి ఒక కీలక నేతని పంపడానికి రంగం సిద్దం చేసింది.

మాజీ కేంద్రం మంత్రి రాజ్యసభ సభ్యుడు చంద్రబాబు అధికారంలో లేనపుడు ఆర్ధికంగా సాయం చేసిన వ్యక్తి సుజనా చౌదరి ని టీడీపీ నుంచీ పవన్ కళ్యాణ్ పార్టీ లోకి వెళ్ళేలా వ్యూహాలు రచిస్తోంది..ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు సైతం పూర్తయ్యాయని అంటున్నారు త్వరలో అధికారికంగా ‘జనసేన’ పార్టీలోకి చేరతారని కొన్ని వర్గాలు ద్వారా సమాచారం అందుతోంది..అయితే ఇటీవల కాలంలో సుజనాకి చంద్రబాబు కి మధ్య గ్యాప్ పెరిగిన మాట వాస్తవం అంతేకాదు టీడీపీ కార్యక్రమాలలో సైతం సుజనా అంటీ ముట్టనట్టుగా తిరుగుతున్నారు.

తిరుపతిలో నిర్వహించిన హోదా సభలో సైతం మొక్కుబడిగా పాల్గొని..ముఖ్యమంత్రి చంద్రబాబు రాకముందే ప్రసంగి…స్టేజీ దిగి వెళ్లిపోయారు..చంద్రబాబు కూడా సుజనా పని తీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది..ఆయన పార్టీ కంటే కూడా ఎక్కువగా తన వ్యాపార వ్యవహారాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది..అందుకే బీజేపి కి దగ్గరగా ఉంటూ బాబు కి దూరం అవుతున్నారట సుజనా..అంతేకాదు టీడీపీ లో సీనియర్ మంత్రి అయిన ఒక నేత సైతం సుజనా పార్టీ లో ఉండరు అనే విషయాన్ని సందేహం లేకుండా చెప్తున్నారట.

అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సుజనా బీజేపి వెళ్ళినా అది డ్యామేజ్ అవుతుంది బాబు కి సింపతీ పెరుగుతుంది కాబట్టి సుజనా ని “జనసేన” లోకి పంపడం మంచిదని భావిస్తున్నారట..అందుకు తగ్గట్టుగానే సుజనా తన ఛానెల్ లో జనసేన కి అనుకూలంగా ఉండటం మరియు జనసేన కార్యక్రమాలకి ఆర్ధిక సాయం లాంటివి చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది..ఇదే గనుకా జరిగి సుజనా జనసేన లోకి వెళ్తే చంద్రబాబు కి కోలుకోలేని దెబ్బ తగలడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..మరి భవిష్యత్తులో సుజనా టీడీపీ తో ఉంటారా లేక జనసేన తో జట్టు కడుతారా అనేది వేచి చూడాల్సిందే.