రాజీనామాలు చేద్ధామంటున్న టీడీపీ .. ఇరుకునపడ్డ వైసీపీ ?

ప్రతి విషయంలోనూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, టీడీపీ పై వైసీపీ పై చేయి సాధించాలని టీడీపీ చూస్తుండగా, టిడిపి అంతే స్థాయిలో తమ రాజకీయ అనుభవం ఉపయోగించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, జగన్ కు ఏ విషయంలోనూ పూర్తిస్థాయిలో క్రెడిట్ దక్కకుండా చేయడంలోనూ సక్సెస్ అవుతూ వస్తోంది.ఇప్పుడు పార్లమెంటులోనూ అదే స్థాయిలో వైసీపీ పై పైచేయి సాధించాలని చూస్తోంది.

 Tdp Mp Ram Mohan Naidu Seeks Resignation To Ycp Mps Over Steel Plant Issue,  Tdp-TeluguStop.com

కేవలం తమకు ముగ్గురు ఎంపీలు ఉన్నా, ఎక్కువ సంఖ్యలో ఉన్న వైసిపి సభ్యులను ఇరుకునబెట్టి, తద్వారా జగన్ గ్రాఫ్ తగ్గించాలనే లక్ష్యంతో టిడిపి ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తోంది.పార్లమెంట్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావించి, మిగతా సమస్యల పైన వైసిపి పోరాటం చేయాలని చూస్తోంది.

దీని ద్వారా బీజేపీ తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తోంది.ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి తాము అనుకూలంగా ఉన్నట్లుగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నా, రఘురాం వ్యవహారంతో పాటు, విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం, మరికొన్ని అంశాలలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని వైసీపీ చూస్తోంది.

అయితే ఈ వ్యవహారాల్లో వైసీపీ పట్టు సాధించకుండా టిడిపి వ్యూహాత్మకంగా రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.

Telugu Ap Cm Jagan, Jagan, Loksabha, Rammohan, Srikakulam Mp, Tdp Mp, Vizag Stee

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి అనుకుంటే  మనమంతా కలిసి రాజీనామా చేద్దాం అంటూ శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రతిపాదించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని వైసిపి చూస్తుండటంతో, టిడిపి ఈ రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది.నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని, వారితో పాటు మేము చేస్తామని టిడిపి ఇప్పుడు ప్రతిపాదించడం ద్వారా జనాల్లో టిడిపి గ్రాఫ్ పెంచడంతో పాటు, వైసిపి ప్రభుత్వం పై అనుమానాలు పెరిగే విధంగా చేయాలని, ఆ విధంగా ముందుకు వెళ్తూ టిడిపి సక్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube