బీజేపీ లోకి ఆ టీడీపీ ఎంపి ?

ఇప్పటికే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మరికొన్ని కష్టాలు వచ్చిపడినట్టుగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే అనేకమంది టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వైసిపి కి జై కొట్టారు.

 Tdp Mp Kesineni Nani Try To Join In Bjp Bjp, Ap, Tdp, Chandrababu, Jagan, Vijaya-TeluguStop.com

అనధికారికంగా ఆ పార్టీలో కొనసాగుతున్నారు.ఇంకా అనేక మంది వైసీపీలోకి క్యూ కట్టేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

తాజాగా విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని టిడిపి నుంచి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.గత కొంతకాలంగా టిడిపి అధిష్ఠానం తీరుతో నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

       ముఖ్యంగా ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, బోండా ఉమా వంటి నాయకులతో ఆయనకు వివాదం కొనసాగుతూనే ఉంది.ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి తెలిసినా, తనను పెద్దగా పట్టించుకోకుండా, బుద్ధ వెంకన్న, బోండా ఉమాను   ప్రోత్సహిస్తూ ఉండటం తదితర పరిlణామాలు నాని కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.

ఈ క్రమంలోనే ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు ఢిల్లీలోని బిజెపి నేతలతోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.బిజెపి నుంచి సానుకూల స్పందన రావడంతో కేశినేని భవన్ లో ఉన్న చంద్రబాబు టిడిపి ఫ్లెక్సీ లను సైతం తొలగించారట.
   

Telugu Chandrababu, Jagan, Kesianeninani, Kesineni Nani, Vijayawada Mp-Telugu Po

   దీంతోపాటు కీలక అనుచరుల తోను పార్టీ మార్పు వ్యవహారం పై చర్చించినట్లు సమాచారం.ఇప్పుడు నాని తన కార్యాలయంలో టిడిపి ఫ్లెక్సీలను తొలగించడంతో ఆయన బిజెపిలో చేరబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.ఇదే కనుక జరిగితే టిడిపి కి మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.మరికొంతమంది నేతలు వైసిపి,  బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టిడిపికి చెందిన చాలామంది నాయకులే బిజెపి వైసిపిలలో చేరిపోయారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి రాజ్యసభ సభ్యులు కూడా బిజెపి కండువా కప్పేసుకున్నారు.ఇప్పుడు నాని కూడా అదే బాట పడితే టీడీపీ ఇబ్బంగులు మామూలుగా ఉండవు.

     

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube