వైసీపీ పార్టీ పై సెటైర్లు వేసిన కేశినేని నాని  

Tdp Mp Keshineni Nani Reacts On Demolishing The Praja Vedika-

ఏపీ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు.గత కొంత కాలంగా టీడీపీ పై అసంతృప్తి తో ఉన్న ఆయన పెద్దగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోవడం లేదు.

Tdp Mp Keshineni Nani Reacts On Demolishing The Praja Vedika--Tdp Mp Keshineni Nani Reacts On Demolishing The Praja Vedika-

అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం చేపట్టడం తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా వేదికగా తొలిసారి స్పందించారు.గత కొద్దీ రోజులుగా ఈ ప్రజావేదిక అంశం పై టీడీపీ,వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

Tdp Mp Keshineni Nani Reacts On Demolishing The Praja Vedika--Tdp Mp Keshineni Nani Reacts On Demolishing The Praja Vedika-

అయితే ఇప్పటివరకు స్పందించని కేశినేని నాని తాజాగా తొలిసారి స్పందించారు.” ఇంకా నయం… తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది.అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే!” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంటే, కృష్ణా నది తీరాన ఉంటే తాజ్‌ మహల్‌ను కూడా సీఎం జగన్ విడిచిపెట్టేవారు కాదేమో అనే కోణంలో సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.మరి దీనిపై వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.ఇప్పటికే రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఇప్పుడు తాజాగా ఆ పార్టీ పై సెటైర్లు వేయడం తో ఇక ఈ గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలి.