టీడీపీలో ఆ ఇద్ద‌రికి ఎమ్మెల్సీలు ఖ‌రారు..!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో ఎమ్మెల్సీ ప‌ద‌వుల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.వైకాపా నుంచి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర‌రావు, కాంగ్రెస్ నుంచి వ‌చ్చి సైకిల్ ఎక్కిన రుద్ర‌రాజు ప‌ద్మ‌రాజుల పేరు ఓ రేంజ్‌లో వినిపిస్తున్నాయి.2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో జూపూడి ప్ర‌భాక‌ర్ వైకాపాలోనే ఉన్నారు.అయితే, ఆ త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణల నేప‌థ్యం, చంద్ర‌బాబు పిలుపులో భాగంగా జూపూడి.

 Mlc Tickets Confirmed For Jupudi And Rudraraju-TeluguStop.com

జ‌గ‌న్‌కి షాకిచ్చి.సైకిలెక్కారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌కు ఎమ్మెల్సీ టికెట్ కావాల‌ని చంద్ర‌బాబును కోరారు.దీనికి ఆయ‌న ఓకే అన్నారు.

ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌డంతో జూపూడి టీడీపీలోకి చేరిపోయారు.ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు.

ఈయ‌న‌కు ఎమ్మెల్సీగా గ‌తంలోనే టికెట్ ఆఫ‌ర్ చేశారు.అయితే, జూపూడి ఓటు హ‌క్కు హైద‌రాబాద్‌లోనే ఉండిపోవ‌డంతో ఈ ప్ర‌క్రియ ముందుకు సాగ‌లేదు.

దీంతో ఇప్పుడు ఆయ‌న త‌న ఓటు హ‌క్కును ఏపీకి మార్చుకున్నారు.దీంతో ఈ ద‌ఫా జూపూడికి ఎమ్మెల్సీ టికెట్ ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

విద్యావేత్త అయిన జూపూడికి ఎమ్మెల్సీ కోసం ఆయ‌న సామాజిక వ‌ర్గం ఎదురు చూస్తోంది.ఇక‌, కాంగ్రెస్ నుంచి వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మ‌రో నేత రుద్ర‌రాజు.

ఈయ‌న క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌.కాంగ్రెస్‌లో ఎంతో అంకిత భావంతో ఉన్నారు.

అయితే, 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నామ‌రూపాలు లేకుండా పోవ‌డంతో ఆయ‌న తొలుత వైకాపా నుంచి ఆహ్వానం అందినా.అటు వెళ్ల‌కుండా చంద్రాబాబు చెంత‌న టీడీపీ గూటికి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏదో ఒక ప‌ద‌విని ఆశించారు.నిజాయితీగల నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.

క్షత్రియ సామాజికవర్గాకి ఎమ్మెల్సీ పదవి ఇంతకు ముందు ఇవ్వకపోవడంతో ఆ వర్గానికి చెందిన ‘రుద్రరాజు’కు ఇవ్వాలని ఆ సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేతలు ‘బాబు’పై ఒత్తిడి తెస్తున్న‌ట్టు స‌మాచారం.సో.బాబు కూడా రుద్ర‌రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వ‌డం ద్వారా క్ష‌త్రియుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.సో.ఈ ఇద్ద‌రికీ ఎమ్మెల్సీలు ఖ‌రార‌య్యాయ‌న్న‌మాట‌!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube