మూర్ఖత్వానికి ప్రతిరూపం జగన్ అంటున్న లోకేష్ బాబు  

TDP MLC Nara Lokesh questions CM Jagan for not wearing Mask, TDP MLC Nara Lokesh, CM Jagan , Mask, Nara Lokesh Twitter, Corona Cases, Mask - Telugu Cm Jagan, Corona Cases, Mask, Nara Lokesh Twitter, Tdp Mlc Nara Lokesh, Tdp Mlc Nara Lokesh Questions Cm Jagan For Not Wearing Mask

మూర్ఖత్వానికి ప్రతిరూపం ఏపీ సీఎం జగన్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ధ్వజమెత్తారు.రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని,వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నప్పటికీ కూడా సీఎం గారిలో మాత్రం మూర్ఖత్వం తగ్గడం లేదని, ఇన్ని కేసులు పెరిగిపోతున్నా కూడా ఆయన మాత్రం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ మాత్రం ధరించడం లేదు అంటూ లోకేష్ బాబు మండిపడ్డారు.

TeluguStop.com - Tdp Mlc Nara Lokesh Tweets Ys Jagan Not Wearing Mask

మూర్ఖత్వానికి మానవ ప్రతిరూపంగా జగన్ మిగిలిపోయారని ఆయన మాస్కు పెట్టుకోరు, వేరే వాళ్లను పెట్టుకోనివ్వరు అని ఆరోపించారు.ట్విట్టర్ ద్వారా జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్ ఈ క్రమంలో ఓ వీడియో కూడా పంచుకున్నారు.

అంతేకాకుండా చీరాల యువకుడు కిరణ్ మృతి ఉదంతాన్ని ప్రస్తావించిన ఆయన సీఎం గారే మాస్క్ పెట్టుకోనప్పుడు దళిత యువకుడు కిరణ్ ని మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపడం ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు.
అసలు పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని చంపింది మాస్కు వేసుకోలేదనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

TeluguStop.com - మూర్ఖత్వానికి ప్రతిరూపం జగన్ అంటున్న లోకేష్ బాబు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image
#Corona Cases #CM Jagan #NaraLokesh #TDPMLC #TDPMLC

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Mlc Nara Lokesh Tweets Ys Jagan Not Wearing Mask Related Telugu News,Photos/Pics,Images..