వైసీపీ ఆగడాలు భరించలేమంటూ కడప జిల్లా ఎస్పీని ఆశ్రయించిన టీడీపీ ఎమ్మెల్సీ.. !!

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కడప జిల్లాలో వైసీపీ నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.తాజాగా జరగనున్న పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

 Tdp Mlc Btech Ravi Complaints To Sp Over Ycp Leaders , Kadapa, Tdp Mlc, Btech Ra-TeluguStop.com

ఎన్నికల నేపధ్యంలో టీడీపీ మద్దతుదారులను, ఓటర్లను వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారి దౌర్జనాలకు అడ్డుకట్ట వేయాలని బీటెక్ రవి, ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, పైడిపాళెం, పెద్ద జూటూరు, మల్లేల, దుగ్గన్నగారిపల్లె తదితర పంచాయతీల్లో వైసీపీ నేతల అరచకాలకు అడ్దు లేకుండా పోతుందని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

అదీగాక కొందరు వైసీపీ నేతలు ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తూ, టీడీపీ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతు మానసికంగా హింసిస్తున్నారంటూ పేర్కొన్నారు.

ఇక తమ మాట వినని వారి పంటలు ధ్వంసం చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని వెల్లడించారు.

అయితే జిల్లా ఎస్పీ అన్బురాజన్ తమ ఫిర్యాదుకు సానుకూలంగా స్పందించి, షాడో బృందాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని బీటెక్ రవి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube