వంశీ ఎఫెక్ట్ : అలిగిన టీడీపీ ఎమ్మెల్సీ  

Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand-

రెండు రోజులుగా ఏపీ పాలిటిక్స్ మొత్తం విజయవాడ చుట్టూనే తిరుగుతున్నాయి.తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన దేవినేని అవినాష్ వ్యవహారం పక్కన పెడితే చాలా రోజుల కిందట రాజీనామా చేసి ఏ పార్టీలో చేరకుండా వేచి చూస్తున్న వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.నిన్న ఆయన టిడిపి పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఆ తరువాత ఈ వ్యవహారంపై ఓ మీడియా ఛానల్ డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand--Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand-

ఆ చర్చల్లో వల్లభనేని వంశీ తో పాటు టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.ఆ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి వంశీ పరుష పదజాలంతో విమర్శలు చేశారు.ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా పార్టీ గాని, పార్టీ నాయకులు గానీ లేకపోవడం పై ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మనస్థాపానికి గురయ్యారట.ముఖ్యంగా టీవీ డిబేట్ లో బోడె ప్రసాద్ దగ్గర తన కూతురి పెళ్లి నిమిత్తం డబ్బులు తీసుకున్నాను అని వంశీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాల్సిన పార్టీ నాయకులు కానీ, బోడె ప్రసాద్ గాని తనకు మద్దతుగా మాట్లాడకపోవడంపై ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారన్నారు.

Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand--Tdp Mlc Babu Rajendra Prasad Unhappy With Party Stand-

ఇక వంశీ పై న్యాయ పోరాటం చేసే విషయంలో పార్టీ తనకు అన్ని విధాలుగా నే సహాయ సహకారాలు అందిస్తేనే ముందుకు వెళ్లాలని, లేకపోతే సైలెంట్ గా ఉండిపోతానని రాజేంద్ర ప్రసాద్ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తానికి ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోకపోవడం పై రాజేంద్ర ప్రసాద్ కు ఎక్కువ అ బాధ ఉన్నట్టు కనిపిస్తుంది.మరి టిడిపి అగ్రనాయకత్వం ఈ ఎమ్మెల్సీ బాధను తీరుస్తోందో లేదో చూడాలి.