టీడీపీలో చివ‌ర‌కు ఆ ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగులుతాడా...?

ఏపీలో టీడీపీకి రోజుకో షాక్ త‌గులుతోంది.యేడాదిలోనే న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు.

 Tdp Mlas Quits Party Joining Ycp, Velagapudi Rama Krishna Babu,tdp,chandra Babu-TeluguStop.com

ఇప్పుడు పార్టీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో పార్టీకి దూర‌మైన న‌లుగురిని తీసేస్తే 19 మంది ఉన్నారు.వీరిలో వియ్యంకులు అయిన బాల‌య్య‌, బాబును ప‌క్క‌న పెట్టేస్తే ఇక మిగిలింది 17 మంది.

వీరిలో మాజీ మంత్రి గంటా, గ‌ణ‌బాబు, బెందాళం అశోక్ లాంటి వాళ్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు.గొట్టిపాటి ర‌విని న‌మ్మే ప‌రిస్థితి లేదంటున్నారు.

ఈ లెక్క‌న చూస్తే మొత్తం మీద టీడీపీని న‌మ్మి పార్టీలో ఉంటోన్న వారి సంఖ్య సింగిల్ డిజిట్‌కు మించే ప‌రిస్తితి లేదు.

ఇక కీల‌క‌మైన విశాఖ జిల్లా విష‌యానికి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో పార్టీ చిత్తుగా ఓడినా న‌గ‌రంలోని నాలుగు దిక్కుల్లో న‌లుగురు ఎమ్మెల్యేలు గెలిచారు.

వీరిలో ఫ‌స్ట్ వికెట్ ప‌డిపోయింది.ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ జ‌గ‌న్ చెంత చేరిపోయారు.ఆయ‌న వార‌సుల‌కు వైసీపీ కండువా క‌ప్పించేశారు.ఇక మిగిలిన ముగ్గురిలో మాజీ మంత్రి, ఉత్త‌రం ఎమ్మెల్యేను టీడీపీ న‌మ్మ‌డం లేదు… టీడీపీని ఆయ‌న న‌మ్మ‌డం లేదు.

ఇక ప‌శ్చిమ ఎమ్మెల్యే గ‌ణ‌బాబు సైతం పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఆయ‌న లోకేష్ తీరుపై మండిపోతున్నార‌ట‌.

Telugu Chandra Babu, Mla Gana Babu, Ntr Big Fan, Velagapudirama, Stay-Political

ఇక ఇప్పుడు పార్టీ స‌మావేశాల‌కు ఒక్క బాబు మాత్ర‌మే ఒకే ఒక్కడుగా హాజరవుతున్నారు.గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా బ‌ల‌వంతులే అని చెప్పాలి.ఇప్పుడు వీరిని కూడా కాపాడుకోలేని ప‌రిస్థితి బాబుది.ఇక వెల‌గ‌పూడి అయినా బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో పాటు.ఎన్టీఆర్‌కు వీరాభిమాని.పైగా బాల‌య్య సిఫార్సు వ‌ల్లే మ‌నోడికి సీటు వ‌చ్చింది.

ఇక కులాభిమాన‌మో లేదా నంద‌మూరి ఫ్యామిలీ అభిమాన‌మో కాని.ఆయ‌న మిన‌హా విశాఖ‌లో టీడీపీకి మిగిలే ఎమ్మెల్యే ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube