టీడీపీలో జోష్ నింపుతున్న ఆ న‌లుగురు...!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి పున‌ర్వైభ‌వం తీసుకురావాల‌నే ప్ర‌ధాన లక్ష్యంతో దూసుకుపోతున్నారు.పార్టీ అధినేత చంద్ర‌బాబు.

 That Four Members Filling Josh In Tdp,ap,andhra Pradesh,chandra Babu,tdp,veera A-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే పార్టీలో ప‌ద‌వులు కేటాయించారు.ప్ర‌ధానంగా పార్ల‌మెంట‌రీ జిల్లాల‌కు కీల‌క‌మైన నేత‌ల‌ను నియ‌మించారు.

ఆయా పార్ల‌మెంట‌రీ జిల్లాల్లోని ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లే.బాధ్య‌త‌ల‌ను వారికి అప్ప‌గించారు.

అయితే, వీరిలో ఎంత మంది దూకుడుగా ఉన్నారు ? ఎవ‌రెవ‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ స‌త్తా చాటుతున్నారు ? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.కేవ‌లం న‌లుగురు మాత్రమే తెర‌మీదికి క‌నిపిస్తున్నారు.

గుంటూరు జిల్లా బాప‌ట్ల పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు దూకుడుగా ముందుకు సాగుతున్నారు.నిరంత‌రం శ్రేణుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు.

స్థానికంగా పార్టీకి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఇక‌, ఏలూరు పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు కూడా దూకుడుగా ఉన్నారు.

అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.ఎక్క‌డెక్క‌డ లోపాలున్నాయో గుర్తించి స‌రిచేసే ప్ర‌క్రియ ప్రారంభించారు.

అదేవిధంగా గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వినుకొండ మాజీ ఎమ్మెల్యే  జీవీ ఆంజ‌నేయులు కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు.జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కూడా అన్ని జీవీ.

ఇక్క‌డి లోపాల‌పై దృష్టిపెట్టారు.అదేస‌మ‌యంలో స‌ర్కారు త‌ప్పుల‌ను ఎత్తి చూపించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

జీవీ ఉమ్మ‌డి గుంటూరు జిల్లా అధ్య‌క్షుడిగా ప‌ని చేయ‌డంతో ఇప్పుడు ఆయ‌న‌కు న‌ర‌సారావుపేట‌లో పార్టీని న‌డిపించ‌డం న‌ల్లేరు మీద న‌డ‌కే అయ్యింది.

Telugu Andhra Pradesh, Chandra Babu, Energetic, Josh, Lokesh, Tdp-Political

ఇక‌, శ్రీకాకుళం పార్ల‌మెంట‌రీ జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన  ఆముదాల ‌వ‌ల‌స మాజీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్‌.కూడా దూకుడుగా ముందుకు సాగుతున్నారు.ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంటున్న ఆయ‌న ప్ర‌జ‌ల్లో నిరంత‌రం ఉంటున్నారు.

స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.ఈ న‌లుగురు దూకుడు ఇలా ఉంటే.

మిగిలిన వారిలో ఒకింత ప‌ర్వాలేద‌నే స్థాయిలో ప‌నిచేస్తున్నారు.

అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, పెనుగొండ‌లో బీకే పార్థ‌సార‌థి.

ఒకింత ప‌ర్వాలేద‌నే రేంజ్‌లో ముందుకు సాగుతున్నారు.కాగా,  అర‌కు పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్‌.

గుమ్మ‌డి సంధ్యారాణి, వైజాగ్ పార్ల‌మెంట‌రీ జిల్లా చీఫ్‌ ప‌ల్లా శ్రీనివాస‌రావు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం పార్ల‌మెంట‌రీ జిల్లా ఇంచార్జ్ తోట సీతారామ‌ల‌క్ష్మి, విజ‌య‌న‌గ‌రం పార్ల‌మెంట‌రీ ఇన్‌చార్జ్ కిమిడి నాగార్జున‌తో పాటు మ‌రి కొంద‌రు నేత‌ల‌ పెర‌ఫార్మెన్స్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పుంజుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube