గుంటూరు “టీడీపీకి షాక్”.వైసీపీలోకి “కీలక నేత”..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలైన సమయంలో ఆ పాదయాత్రకి మైలేజ్ పెరగకుండా ఉండేందుకు వైసీపి నుంచీ టిడిపి లోకి ఎమ్మెల్యేలు.వైసీపి బడా నేతలు వచ్చి చేరేలా చంద్రబాబు నాయుడు తన మంత్రి వర్గంలో ఉన్న కీలకమైన వ్యక్తులకి కొన్ని భాద్యతలు అప్పగించారు.

 Tdp Mla Jump Into Ysrcp Party-TeluguStop.com

అప్పట్లో జగన్ అడుగు తీసి అడుగు వేస్తూ తన యాత్ర జిల్లాలో దాటే లోపు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో నేత వైసీపిని వీడి సైకిల్ ఎక్కేసే వారు.దాంతో ఒక్కసారిగా జగన్ పాదయాత్రకి కొంత డ్యామేజ్ ఏర్పడినా సరే ఇలా చేయడం ఎంతవరకూ సమంజసం.

ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది అనేలా సామాన్య ప్రజలకి సందేహం.చిరాకు కలిగేలా టిడిపి ప్రభుత్వం వలసలని ప్రోశ్చహించింది అయితే.

తరువాత టిడిపిలో చేరే వారు లేక పోవడం మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అనే విధంగా చంద్రబాబు వలసలకి పులిస్టాప్ పెట్టారు.

ఇదిలాఉంటే జగన్ పాదయాత్ర కి భారీగా జనాలు రావడం రోజు రోజుకి జగన్ కి ప్రజాదరణ పెరగడం చుసిన వైసీపి నేతలు.

ముఖ్యంగా జంపింగ్ నేతలు భవిష్యత్తులో జగన్ తో కలిసిఉంటేనే మంచిదని భావించారు.అయితే జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజు నుంచీ కూడా ఎక్కువగా గుంటూరు జిల్లా పాదయాత్రపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

గుంటూరు లో యాత్ర ఆరంభం అయినప్పటి నుంచీ యాత్ర ముగిసే వరకూ కూడా టిడిపిలో ఎవరు కీలకంగా ఉన్నారో వారు వైసీపిలోకి వచ్చేలా వ్యూహాలు రచించారు.ఆ భాద్యతని పార్టీలోని కీలక నేతలకి అప్పగించారు.

అయితే ఈ సమయంలోనే గుంటూరు జిల్లా టిడిపి కీలక నేత ఒకరు జగన్ పార్టీ లోకి జంప్ చేయడానికి సర్వం సిద్దం చేసుకున్నారని టాక్.

ఇంతకీ ఆ నేత ఎవరంటే టిడిపి సీనియర్ నేత “యలమంచిలి రవి” త్వరలో టిడిపికి రాజీనామా చేసి వైసిపి తీర్దం పుచ్చుకోనున్నారు…అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా రవి వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

పేరుకే ఇతర పార్టీలపై కన్నేసినా దృష్టి పెట్టింది మాత్రం ప్రధానంగా టిడిపిపైనే అన్న విషయం తెలిసిందే.అందులో భాగంగానే మొన్ననే జ్యోతుల చంటిబాబు, నిమ్మకాయల రాజరత్నం లాంటి టిడిపి నేతలు వైసిపిలో చేరారు.

రవికి వైసిపికి మధ్య చాలాకాలంగా వ్యవహారం నడుస్తున్నా ఫైనల్ అయింది మాత్రం ఇపుడే.కృష్ణా జిల్లాలోకి జగన్ ప్రవేశించేరోజున అంటే ఏప్రిల్ 10వ తేదీ ప్రాంతంలో రవి వైసిపిలో చేరనున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే గుంటూరు లో ఎంతో బలమైన నేతగా ఉన్న యలమంచిలి రవి వైసీపిలోకి వెళ్ళారంటే చంద్రబాబు కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి… ఎందుకంటే, ప్రస్తుతం వైసిపిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన చెప్పుకోదగ్గ నేతలు పెద్దగా లేరు.అటువంటిది మాజీ ఎంఎల్ఏల రవి వైసిపిలో చేరితే అక్కడ జగన్ కి కమ్మ వర్గం నుంచీ ఎన్నో కొన్ని ఓట్లు పడేలా అవకాం ఉంటుది అని ఇదే వైసీపికి ప్లస్ అయ్యేలా ఉంది…అంతేకాదు రవి చేరిక సైతం ఎంతో భారీగా ప్లాన్ చేశారట.

మరి జగన్ మోహన్ రెడ్డి యలమంచిలి రవికి టిక్కెట్టు ఏ స్థానం నుంచీ ఇస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube