జగన్ కాళ్ళు పట్టుకుంటా..టీడీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..రీజన్ ఇదే       2018-04-14   01:21:03  IST  Bhanu C

గత కొంతకాలంగా ఏపీలో అధికార పార్టీకి మరియు ప్రతిపక్ష పార్టీకి మధ్య వార్ జరుగుతూ వస్తోంది ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పుడు ఆ వార్ మరింత ఉదృతం అయ్యింది..అయితే ఈ నేపధ్యంలో వైసీపి నుంచీ టిడిపిలోకి జంప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా జగన్ పై ఎప్పటికప్పుడు ఎదో ఒక సందర్భంలో కామెంట్స్ చేస్తునే ఉన్నారు..తాజాగా జగన్ పై జలీల్ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి ఇంతకీ జలీల్ఖాన్ ఏమన్నారు అంటే..

మ్యాధ్స్ ,పిజిక్స్ విషయంలో ఎంతో సంచలనం అయిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే జలీల్ఖాన్ అప్పట్లో ఇదే అంశంపై టిడిపి పరువు పోగొట్టారు దాంతో మంత్రి వర్గ విస్తరణ లో తన పేరు ఉన్నా సరే పదవి రాకుండా పోయింది..ఇక అప్పటి నుంచీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు తనపై దయ చూపుతారో అని జగన్ ని తిట్టని తిట్టు తిడుతూ చంద్రబాబు దృష్టిలో పడటానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు..మే నెలలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది అనే నేపధ్యంలో జలీల్ఖాన్ తన వ్యాఖ్యలకి మంత్రి పదును పెట్టారు జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

జగన్ మోహన్ రెడ్డి కి సవాళ్ళు మీద సవాళ్లు విసురుతున్నారు..ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ ఒక్కసారి విమర్శించగలిగితే తాను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ చేశారు..ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టే నాలుగేళ్ల పాటు ఓపిక పట్టారని… ప్రతిపక్ష నేతగా ఈ నాలుగేళ్లలో జగన్ చేసింది ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. జగన్ నోటి నుంచి మోదీ ఒక దొంగ, బీజేపీ మోసం చేసింది అనే మాట వస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.

పార్లమెంటు ని నడపలేని మోడీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు…రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఇన్ కంటాక్స్ కట్టనవసరం లేదని జగన్ చెబుతున్నారని..దీన్నిబట్టి జగన్ కు కనీస జ్ఞానం లేదని..ఇలాంటి వాడు ఏపీకి ముఖ్యమంత్రి అయితే దేశం బ్రష్టు పట్టిపోతుందని అన్నారు జలీల్ఖాన్..