ఇటీవల ఏపీ సీఎం జగన్ తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడటం జరిగింది.ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.ఆ వీడియో లపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అంటే ఇదే అంటూ విమర్శించారు.
టీడీపీ హయాంలోనే పిల్లల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పిల్లలకు నైపుణ్యాభివృద్ధి, భావవ్యక్తీకరణ మెళకువలకు సంబంధించి శిక్షణ ఇప్పించి, వారిని న్యూయార్క్ పంపించిన ఘనత టీడీపీదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్ఘాటించారు.ఇప్పుడు ముఖ్యమంత్రి ఇ గారు కొత్తగా తానే ఏదో ఇంగ్లీష్ ను సృష్టించినట్టు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో న్యూయార్క్ నగరంలో వెళ్ళి స్థిరపడిన విద్యార్థుల వీడియోను కూడా ఈ సందర్భంగా షేర్ చేయడం జరిగింది.