స్పీకర్ తో గంటా భేటీ ? రాజీనామా ఆమోదిస్తున్నారా ? 

ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో ఉంటూ ఉంటారు.విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.

 Vizag Tdp Mla, Ganta Srinivasarao, Ysrcp, Ap, Tdp, Chandrababu, Vizag Steel Plan-TeluguStop.com

టిడిపి నుంచి 2019 ఎన్నికలలో గెలిచి, ఆ తర్వాత వైసీపీ లోకి వచ్చేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు.కానీ వైసిపిలో విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ రావు వంటివారు అడ్డం పడటం వంటి కారణాలతో ఆయన చేరికకు బ్రేక్ పడిపోయింది.

ఇక అప్పటి నుంచి టిడిపిలో ఉన్నా, లేనట్టుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే పాల్గొంటూ, గంట కాలం నెట్టుకొస్తున్నారు.ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండటంతో, వెంటనే దానికి నిరసనగా అని చెబుతూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

అయితే ఆయన స్పీకర్ ఫార్మెట్ లో ఆ రాజీనామా చేయలేదు అనే విమర్శలు రావడంతో, వెంటనే ఆ స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా సమర్పించారు.

ఇప్పటికే టీడీపీలో ప్రాధాన్యం లేక, వైసీపీలో తన ఇమేజ్ ను మరింత పెంచుకునేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలోకి గంటా దిగిపోయారు.

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో గంటా శ్రీనివాసరావు ఈరోజు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో గంటా శ్రీనివాసరావు ఏకాంతంగా చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు స్పీకర్ ను కోరినట్లు తెలుస్తోంది.కానీ స్పీకర్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించకుండా వెయిటింగ్ లో పెట్టారట.

దీనిపై తమ్మినేని సీతారాం ఏ విషయం స్పష్టం చేయకపోవడంతో,  గంటా రాజీనామాను ఆమోదిస్తున్నారా లేదా అనే విషయంలో వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.విశాఖలో ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుంటే , గంటా రాజీనామాను తక్షణం స్పీకర్ ఆమోదించే అవకాశం ఉంటుంది.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నారా లేదా అనే విషయం క్లారిటీ వస్తే కానీ, గంటా రాజీనామా ఆమోదిస్తారా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube