విజయసాయి ట్వీట్లను కాకి రెట్ట తో పోల్చిన టీడీపీ ఎమ్మెల్యే !

వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసే టీడీపీ కీలక నాయకులు అందరి పైనా విమర్శలు చేస్తూ,  వ్యంగ్యంగా సోషల్ మీడియా ద్వారా సెటైర్లు వేస్తూ ఉంటారు విజయసాయిరెడ్డి.

 Tdp Mla Counter To Ycp Mp Vijaya Sai Reddy Tweets,vijay Sai Reddy, Gorintla Buch-TeluguStop.com

ఆయన ట్వీట్లను వైసిపి సోషల్ మీడియా  విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో అవి మరింత వైరల్ ఆవుతున్నాయి.ఈ మధ్య కాలంలో గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

  టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు,  వంగలపూడి అనిత తో పాటు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారిపైనా అంతే స్థాయిలో వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా విజయసాయి రెడ్డి టిడిపి సీనియర్ బుచ్చయ్యచౌదరి పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

బుచ్చయ్య చౌదరి ఉద్దేశించి విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి.ఎల్లో లైట్ బ్రోకర్ గాడివి అంటూ మండిపడ్డారు.  గంజాయి పాత్రుడు అన్నట్టుగానే మహిళల బట్టలు ఊడదీస్తే.ఆ బిట్లు కూడా ఫార్వర్డ్ చేసి క్యాష్ చేసుకోవాలని అనుకున్నావేంట్రా బుచ్చిగా ? అంటూ విమర్శలు చేశారు.ఎన్ని సార్లు గెలిచినా నువ్వు  గజ్జి కుక్కవేరా బుచ్ఛిగా! ఎవడో ఉస్కో అంటే మొరగడం తప్ప , సొంతంగా ఏమీ చేయలేవు అంటూ విమర్శలు చేశారు .ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వాడి బూట్లు నాకుతున్నావు అంటూ ఫైర్ అయ్యారు.పంది కంటే హీనమైన బతుకు రా బుచ్చీ నీది అంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు .
దీనికి కౌంటర్ గా బుచ్చయ్య చౌదరి విజయసాయిరెడ్డి పై విమర్శలు చేశారు.వైజాగ్ నుండి మరో పిచ్చోడు తయారయ్యాడు అంటూ  మండిపడ్డారు.అసలు ఇంట్లో మీ పిల్లలతో ఏమి భాష మాట్లాడుతారో తెలియదు కానీ,  రాజ్యసభ సభ్యుడి గౌరవం మొత్తం పోగొట్టారు అంటూ బుచ్చయ్యచౌదరి విమర్శించారు.

రోడ్డుమీద తిరిగే పోరంబోకు కూడా నీ లాంటి పోస్టులు పెట్టరు అంటూ మండిపడ్డారు. కాకి రెట్ట ఎంతో… వీసా ట్వీట్లు కూడా అంతేనట విజయసాయి రెడ్డి పై సెటైర్లు వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube