పిచ్చోడి చేతికి ఏకే 47 తరహాలో జగన్‌ ప్రవర్తిస్తున్నాడు  

Tdp Mla Buchhaiah Chowdary Comments On Ap Cm Jagan - Telugu Ap Cm Jagan, Jagan, Jagan And Tdp, Jagan Rulling In Ap, Tdp Buchaiah Chiwdary,

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు దారుణంగా ఉంది అంటూ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు.మూడు రాజధానుల పేరుతో జగన్‌ వ్యవహరిస్తున్న తీరు పిచ్చేడి చేతిలో రాయి అన్నట్లుగా ఉంది అంటూ ఆయన ఆరోపించాడు.

Tdp Mla Buchhaiah Chowdary Comments On Ap Cm Jagan

పిచ్చోడికి ఒక ఏకే 47 ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్‌కు ఓటర్లు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ఆయనకు ఏకే 47లు 151 ఇచ్చినట్లుగా అయ్యిందని ఎమ్మెల్యే ఆరోపించారు.అసలు ఇప్పటి వరకు ప్రజా ఉపయోగదాయకమైన పని ఒక్కటి కూడా ఆయన చేయలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇప్పటి వరకు ఇలాంటి భయంకరమైన పరిపాలన చూడలేదు అంటూ ఎమ్మెల్యే ఆరోపించాడు.జగన్‌ ఇప్పటి వరకు ఎంతో మందిని బలి తీసుకున్నాడు.ఇంకా కూడా రైతులను బలి తీసుకునేలా మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బందుల పాు చేస్తున్నాడు అంటూ ఆరోపించాడు.ఇలాంటి సీఎం ఉంటే రాష్ట్రం ముందుకు కాకుండా వెనక్కు వెళ్తుందంటూ ఈ సందర్బంగా ఆయన ఆరోపించాడు.

సీఎం జగన్‌ తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ఆయనకు సరైన బుద్ది చెప్తారంటూ బుచ్చయ్య అన్నారు.

తాజా వార్తలు