అచ్చెన్నకు ఏమైంది ? సైలెన్స్ వెనుక కారణం ఏంటి ?

జగన్ ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించాలి అంటే చంద్రబాబు కంటే ముందుగా, ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గొంతెత్తే వారు.అసెంబ్లీలోనూ బయట, బాబుకు అండగా నిలబడుతూ, తెలుగుదేశం పార్టీ తరఫున, ఏపీ ప్రభుత్వంపైనా, విమర్శలు చేసేవారు.

 Reason Behind Tdp Leader Atchannaidu Silence, Tdp, Esi Scam, Ys Jagan Govt, Chan-TeluguStop.com

తెలుగుదేశం పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాబు కి టీడీపీకి అండదండగా నిలబడుతూ వచ్చారు.అయితే అనూహ్యంగా గత టిడిపి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈఎస్ ఐ స్కాం జరగడం, అందులో అతని పాత్ర ఉన్నట్లుగా కొన్ని ఆధారాలు దొరకడంతో, ఏపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయచింది.

సుమారు రెండు నెలల పాటు జైలు కి వెళ్ళాల్సి వచ్చింది.ఆ సమయంలో ఆయన అనారోగ్యానికి గురవ్వడంతో, ఎక్కువ రోజులు ఆస్పత్రిలోనే గడిపారు.

ఇది ఇలా ఉంటే ఇటీవల బెయిల్ తో బయటకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు.ఇక ఆ తర్వాత అచ్చెన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నాడు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది.

చంద్రబాబు సైతం ఆయనకు పార్టీలో ప్రాధాన్యత పెంచాలని, ఆయనే ఏపీ టీడీపీ ని నడిపించగలరని, జగన్ ను ఎదుర్కోవాలంటే నా తర్వాత అది జగన్ కు మాత్రమే సాధ్యం అనే అభిప్రాయం ఏర్పడడం వంటి పరిణామాలతో, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పేరు దాదాపు ప్రకటించేందుకు బాబు సిద్ధమయ్యారు.కానీ ఆ సమయంలోనే చంద్రబాబు తనయుడు లోకేష్ అచ్చెన్న పేరుని వ్యతిరేకించడం వంటి కారణాలతో అది వాయిదా పడింది అనే ప్రచారం జరిగింది.

ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ, పూర్తిగా అచ్చెన్న సైలెంట్ అయిపోయారు.

Telugu Chandrababu, Esi Scam, Lokesh, Tdpatchannaidu, Ys Jagan-Telugu Political

ఎక్కడా హడావిడి చేయడం గాని, రాజకీయ విమర్శలు చేయడం గాని చేయడంలేదు.పూర్తిగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయిస్తున్నారు.అయితే అచ్చెన్న రాజకీయంగా ఎందుకు సైలెంట్ అయ్యారు ? మళ్లీ హడావిడి చేస్తే మరేదైనా కేసుల్లో ప్రభుత్వం ఇరికిస్తుందా అనే భయం అచ్చెన్న లో ఉందా ? ఈ కరోనా సమయంలో ఇటువంటి రిస్క్ చేసి పీకల మీదకు తెచ్చుకోవడం ఎందుకు అనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, టిడిపి మాత్రం అలాంటిదేమీ లేదని, త్వరలోనే పార్టీ కార్యక్రమాల్లో అచ్చెన్న చురుగ్గా పాల్గొని ప్రభుత్వంపై పోరాటం చేస్తారని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా, ఎందుకో కానీ ఆయనపై నమ్మకం కలగడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube