లగడపాటిని ఆ టీడీపీ మంత్రి ఎంత మాట అన్నాడంటే  

లగడపాటిని గట్టిగా వాయించేసిన అయ్యన్నపాత్రుడు .

Tdp Minister Sensational Comments On Lagadapati-lagadapati,tdp,tdp Minister Sensational Comments,ysrcp

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరో రెండు రోజులలో తెలిపోనున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఓ విధంగా చేపపలంటే ఏపీలో ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉంది అని చెప్పాలి..

లగడపాటిని ఆ టీడీపీ మంత్రి ఎంత మాట అన్నాడంటే-TDP Minister Sensational Comments On Lagadapati

అయితే ఓ వైపు రెండు పార్టీలు టెన్షన్ గా ఉన్న కూడా బయటకి మాత్రం మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాల సరళిని అంచనా వేసిన సర్వే సంస్థలు చాలా వరకు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెబితే లగడపాటి మాత్రం తన సర్వేలో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే లగడపాటి సర్వేని ఇప్పుడు టీడీపీ పార్టీ నేతలు విమర్శలు చేయడం ఏపీలో ఆసక్తికరంగా మారింది.

ఎప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలన వాఖ్యలకి కేంద్ర బిందువుగా ఉంటూ, సొంత పార్టీ మంత్రితోనే గొడవ పడే మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు లగడపాటి సర్వేపై సంచలన విమర్శలు చేసారు. లగడపాటి సర్వే కారణంగా తెలంగాణలో చాలా మంది కోట్ల రూపాయిలు పోగొట్టుకుని రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కూడా లగడపాటి జోస్యం అలా బెట్టింగ్ లకి మాత్రమే పని చేస్తాయని, అయితే వాటిని ఈ సారి ఎంత వరకు విశ్వసించొచ్చు అనేని అనుమానమే అని అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. ఇప్పటికే లగడపాటిని వైసీపీ నేతలు ఆడుకుంటూ ఉంటే, ఇప్పుడు తాను గెలుస్తుంది అని చెప్పిన పార్టీ నేతలు కూడా విమర్శలు చేయడం నిజంగా అతనికి చేదు వార్త అని చెప్పాలి.