తిట్ల రాజకీయం టీడీపీ కి కలిసి వచ్చింది ? ఎంతగా అంటే...?

ప్రధాన ప్రతిపక్షం అన్న తర్వాత సహజంగానే విమర్శలు చేయడం సర్వసాధారణం.ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లు గా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎప్పుడూ వివాదం నడుస్తూనే ఉంటుంది.

 Tdp Making Personal Criticisms Targeting Jaga Tdp, Chandrababu, Jagan, Ysrcp, Ap-TeluguStop.com

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి చూసుకుంటే ఇదే రకమైన వైఖరి చోటు చేసుకుంటూనే ఉంది.జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ,  చంద్రబాబు తన రాజకీయ పంతం నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తునే వస్తున్నారు.

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా,  దానికి జగనే కారణం అని , ఆయనే బాధ్యత వహించాలని , రాజీనామా చేయాలి అంటూ చంద్రబాబు హడావుడి చేసేవారు.ఈ విషయాలను వైసీపీ కూడా పెద్దగా పట్టించుకునేది కాదు.

ఇక జనాలలోను ఈ తరహా వ్యవహారాలు సర్వసాధారణం అన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యలను చూసేవారు.అయితే టిడిపి ఇప్పుడు తన పంథా మార్చింది.

ఆ రూట్ వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతూ,  దాని ద్వారా వైసిపి నాయకులు రియాక్షన్ ను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేసింది.

        అనుకున్న ప్రకారమే వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా జగన్ పై విమర్శలు టిడిపి నేతలు మొదలుపెట్టారు.

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వంటివారు చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి.తనను జైలులో పెట్టిన పర్వాలేదు అని,  ఈ ప్రభుత్వం ఉండకూడదు అంటూ జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు.

ఆ తరువాత వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించడం,  ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ టిడిపికి బాగా కలిసి వచ్చాయి.పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా తమకు అనుకూలంగా మారిన రాజకీయ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాలని టిడిపి నిర్ణయించుకుంది.
     

Telugu Ap Cm, Ap, Chandrababu, Jagan, Jogi Ramesh, Ysrcp-Telugu Political News

  ఇకపై పార్టీ నాయకులు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయాలని, దీనికి కౌంటర్ ఇచ్చేందుకు వైసిపి నాయకులు ప్రయత్నించడం,  ప్రతీకారానికి దిగడం ఇవన్నీ టిడిపికి కలిసి వస్తాయని ఎన్నికలనాటికి ప్రజలలో వైసిపి పై ఉన్న అభిప్రాయం పూర్తిగా తొలగి,  తాము అధికారంలోకి వచ్చేందుకు దోహదపడుతుందనే ఆలోచనతో టిడిపి ఉందట.కొత్తగా టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం టిడిపి శ్రేణులు తన నోటికి పని చెప్పే సమయం వచ్చేసినట్టే.టిడిపి పన్నిన ఈ రాజకీయ ట్రాప్  నుంచి వైసీపీ ఏ విధంగా బయటపడుతుందో ?    

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube