ఆయన అంత పనిచేసాడా ? టీడీపీని ఇలా ముంచేసాడా ?  

Tdp Lost In Ap Election Reason Behind In Kutumba Rao-chandrababu,elections Survey,farmmers,kutumba Rao,telugudesham Party,కుటుంబరావు పేరు,తెలుగుదేశం పార్టీ

ఏపీలో తెలుగుదేశం పార్టీ తలెత్తుకోలేని స్థాయిలో అంటే 175 కి కేవలం 23 స్థానాలను మాత్రమే సాధించింది. ఈ ఫలితాలు కనీసం ఎవరూ ముందుగా ఊహించలేదు. అనేక జాతీయస్థాయి సంస్థల సర్వేల్లోనూ, ఫలితాలకు సరిగ్గా మూడు రోజుల ముందు విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ లోనూ టీడీపీకి ఫర్వాలేదు అనే స్థాయిలో సీట్లు సాధిస్తుంది అనే తేల్చాయి. తీరా ఫలితాల ప్రకటన తరువాత వైసీపీ 151 సీట్లతో విజయకేతనం ఎగురవేసింది. గతంలో 102 సీట్లతో అమరావతిని ఏలిన పార్టీ నేడు 23 సీట్లకు పరిమితం అవ్వడానికి కారణం ఎవరు ? బాబు రాంగ్ స్టెప్ వేశాడా ఇలా అనేక ప్రశ్నలు ఇప్పుడు బయలుదేరుతున్నాయి..

ఆయన అంత పనిచేసాడా ? టీడీపీని ఇలా ముంచేసాడా ? -Tdp Lost In Ap Election Reason Behind In Kutumba Rao

ముఖ్యంగా ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పేరు.

షేర్ మార్కెట్‌లో ఉన్న త‌న ప్రతిభను రాజకీయాల్లో ఉపయోగించడంవల్లే ఈ విధమైన ఫలితాలు వచ్చాయంటూ విమర్శలు వస్తున్నాయి. రుణమాఫీ విషయంలో రైతుల‌ను దారుణంగా మోసం చేసిన కుటుంబ‌రావు చివ‌రిగా టీడీపీకి ఇటువంటి గడ్డు పరిస్థితి తీసుకొచ్చాడని అభిప్రాయపడుతున్నారు. రైతుల‌కు రుణాల‌ను మాఫీ చేస్తాన‌ని ప్రక‌టించి అధికారంలోకి వ‌చ్చిన‌ బాబు ఆ త‌ర్వాత ఆ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు.

ఆయ‌న వైఫ‌ల్యానికి ముఖ్య కారణం కుటుంబరావు షేర్ మార్కెట్ తెలివితేటలేనని అంటున్నారు.ఎందుకంటే చంద్రబాబు రైతుల‌కు తాను ఇచ్చిన హామీని ఎలా నెర‌వేర్చాలా అని ఆలోచిస్తుండగానే కుటుంబ‌రావు చెప్పిన కొన్ని ఐడియా లను నమ్మి బాబు ఆయన ట్రాప్‌లో పడిపోయారని తెలుదేశం పార్టీ నాయకులే చెబుతున్నారు.

రైతులను ఇబ్బంది పెట్టడానికి అనేక అనేక నిబంధనలు పెట్టి రైతుల ఆగ్రహానికి గురయ్యారని ,2007 ఏప్రిల్ ఒక‌టో తేదీ నుంచి 2013 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ ఉన్నరైతుల రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని ప్రకటించిన బాబు ఆ తరువాత ఆ రుణాల‌ను మాఫీ చేయ‌క‌పోగా కుటుంబ‌రావు ఐడియాలను అమలుచేశారు. దీని కారణంగా కొత్త రుణాలు పుట్టే అవ‌కాశం కూడా ఇప్పుడు పోయింది.

ఇప్పుడు పంట‌లు వేసుకోవ‌డానికి బ్యాంకుల‌కు వెళుతున్న రైతులకు పైసా రుణం దొరికే అవ‌కాశం లేదు.ఇలా దాదాపు 36 ల‌క్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. ఇవేం పాపం రైతులకు తెలీదు. తమ రుణాల‌న్నీ మాఫీ అయిపోయాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో బ్యాంకుల నుంచి నోటీసులు రావ‌డంతో అసలు విషయం బయటకి వచ్చింది..

ప‌సుపు కుంకుమ కాపాడుతుంద‌ని అనుకున్న బాబుకి వెన‌క ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పుడు ఇలా ఫలితాలు రావడంతో ఒక్కో విషయాన్ని పోస్టుమార్టం చేస్తున్నారు.