బీటలు వారుతున్న టీడీపి కంచుకోట     2017-10-05   00:13:04  IST  Bhanu C

పశ్చిమగోదావరి జిల్లా టిడీపికి కంచుకోటగా ఉండేది..ఇది ఒకప్పుడు ..ఇప్పుడు ఈ కంచుకోట బద్దలు కానుందా అంటే నిజమనే అంటున్నారు విశ్లేషకులు.. పశ్చిమలో అత్యధిక నియోజకవర్గాలు ఎవరు గెలుచుకుంటే వారికే అధికారం వరిస్తుంది అనే సాంప్రదాయం ముందు నుంచీ వస్తోంది..గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పశ్చిమని క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికీ తెలిసిందే..ఆ సమయంలో వైసీపికి ఒక్క సీటు కూడా పశ్చిమ వాసులు అందేలా చేయలేదు..ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది..జిల్లాలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు..నిర్మాణాల పేరిట ప్రజలని ఎంతో ఇబ్బందులకి గురిచేసిన సంఘటనలు జరుగుతూనే వచ్చాయి..ముఖ్యంగా ఏ రైతులు అయితే చంద్రబాబు కి ఓట్లు వేసి గెలిపించారో అదే రైతులు ఇప్పుడు తిరగబడుతున్నారు.

ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రవర్తించిన తీరు..అక్కడ మహిళలని..ఈడ్చుక్కుని వెళ్లి మరీ అరెస్టులు చేయడం..ప్రజలకి ఫ్యాక్టరీ నిర్మాణం అభ్యంతరం అయినా సరే నిరంకుశత్వంగా పోలీసులతో తుందుర్రు ఉద్యమాన్ని అణిచివేయాలని చూశారు..అంతేకాదు..గరగపర్రు లో దళితుల మీద జరిగిన కుల వివక్ష జిల్లాలో ఉన్న దళిత వర్గాల్లో నాటుకుపోయింది..ఏ రైతులు అయితే పట్టం కట్టారో ఆ రైతుల నోళ్లలోనే మట్టికొట్టే ప్రయత్నం చంద్రబాబుకి రాజకీయ పరంగా చాలా ఎదురు దెబ్బ తగిలింది.

ఇది ఇలా ఉంటే అధికారంలోకి రాకముందు ఐక్యతగా ఉన్న నేతలు ఇప్పుడు అధికారం చేతికి రాగానే సొంత లాభాలకోసం..పంతాలకి పోయి పార్టీని రోడ్డున పడేస్తున్నారు.. పార్టీ నేతల్లో సమన్వయ లోపం..ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు షాక్ ఇస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమమే. నేతల మధ్య సమన్వయ లోపం ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది.. జిల్లాలో తాడేపల్లి గూడెంలో అసలు కార్యక్రమమే ప్రారంభం కాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం చేస్తున్నా నేతల మధ్య విభేదాల కారణంగా అందరూ పాల్గొనడం లేదు. ఎమ్మెల్యేలు కూడా పక్కకు తప్పుకుని అనుచరులను ఈ కార్యక్రమానికి పంపుతున్నారు. ఈ పరిణామాల్ని గుర్తించిన చంద్రబాబు జిల్లాల వారిగా గ్రేడ్స్ ఇచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు బి గ్రేడ్ వచ్చింది. దీనిపై చంద్రబాబు నాయుడు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పశ్చిమలో ముఖ్యంగా చింతలపూడి లో జరుగుతున్న పోరు మెట్ట ప్రాంతంలో బాబుకి పెద్ద తలనొప్పిగా మారింది. పంతాలకు, పట్టింపులకూ పోయి పార్టీ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదు. పార్లమెంటు సభ్యడు మాగంటి బాబుకు, చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతకు అసలు పడటం లేదు. దెందులూరు నియోజకవర్గంలో కూడా విభేదాలు గుప్పుమంటున్నాయి. జిల్లాలో మంత్రి మాణిక్యాలరావుకు, టీడీపీ నేతలకు అసలు పొసగడం లేదు. దీంతో జిల్లాలలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయ్యింది . అంతేకాదు రాష్ట్రంలో ఒక్క పశ్చిమలో మాత్రమే కాదు అనంతపురం జిల్లలో కూడా ఇదే రకమైన పరిస్థతి ఉంది.. వైఎస్సార్సీపి మాత్రం అన్న వస్తున్నాడు అంటూ ఇంటింటికీ వెళ్లి చేస్తున్న కార్యక్రమాలు ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతున్నాయి ..అసలు అక్టోబర్ 2న వైఎస్సార్ కార్యక్రమం అయ్యిపోగా..ప్రజలనుంచి స్పందన ఎక్కువగా రావడంతో ఈ కార్యక్రమాన్ని పోదిగించాము అని చెప్తున్నారు..ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే..వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా వాసులు టిడీపికి పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది.