టీడీపీ నుంచి మరో ఎంపీ సీటు వైసీపీ కి పాయే!

ఏపీ లో ఎన్నికలు జరిగిన దాదాపు నెల రోజుల తరువాత ఫలితాలు విడుదల అయ్యాయి.ఈ నెల 23 న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయినా సంగతి తెలిసిందే.

 Tdp Losing One More Mp Seat-TeluguStop.com

అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా గెలుపు ఓటముల పై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికే ఘోర ఓటమి తో తలెత్తుకోకుండా ఉన్న టీడీపీ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది.

మొన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికల సమయంలో ఈవీఎం లలో ఎలాంటి ట్యాపరింగ్ జరగలేదని స్పష్టం చేయడం తో టీడీపీ కి మరో అవకాశం లేక చివరికి కామ్ అయిపొయింది.అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ వర్గాలు కొత్త ఆరోపణలు చేస్తున్నాయి.

గుంటూరు లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో దీనిపై కోర్టు కు కూడా వెళతామని ఆ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఇటీవల హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి మోదుగుల వేణుగోపాలరెడ్డిపై గల్లా కేవలం 4200 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తెలుస్తుంది.

అయితే ఓట్ల లెక్కింపు సంద్భంగా గల్లా అండ్ కో రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ ను మ్యానేజ్ చేశారని, అందుకే వైసీపీ ఓటమి పాలైంది అని వైసీపీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.9 వేల పోస్టల్ బ్యాలెట్ల కవర్లపై సీరియల్ నెంబర్లు లేవన్న కారణంగా వాటిని రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ రిజక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఈవిషంయలో కౌంటింగ్ రోజే… మోదుగుల, మంగళగిరి అభ్యర్థి ఆళ్ల… రిటర్నింగ్ అధికారికి మధ్య వాగ్వాదం జరిగింది.

కవర్లపై సీరియల్ నెంబర్లు లేనంత మాత్రాన రిజక్ట్ చేయాల్సిన అవసరం లేదని మోదుగుల వాదిస్తుండగా,మరోపక్క టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ మాత్రం వాటిని నిరాకరించాల్సిందేనని పట్టుబట్టారు.దీంతో రిటర్నింగ్ అధికారి హోదాలో కలెక్టర్ 9 వేలను పోస్టల్ బ్యాలెట్లను రెజెక్టు చేశారు.

దీంతో ఈ వివాదంపై కోర్టుకెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు వైసీపీ స్పష్టం చేసింది.దీనితో టీడీపీ నుంచి మరో ఎంపీ సీటు కూడా వైసీపీ కి పోయే పరిస్థితి కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube