చినబాబు ... పెద్ద మాటలు లోకేష్ పరువు తీసుకుంటున్నాడు     2018-07-18   11:48:29  IST  Sai Mallula

కొద్ది రోజులుగా టీడీపీ అధినేత పుత్ర రత్నం ఐటీ శాఖ మంత్రి లోకేష్ మీద విమర్శలు ఎక్కువయిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఆయన మీద విమర్శలు చేస్తే పట్టించుకోనక్కర్లేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా లోకేష్ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి అధికారాన్ని చూసుకుని లోకేష్ రెచ్చిపోతున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి మీద పెత్తనం చేయాలనీ చూస్తున్నాడని టీడీపీ సీనియర్లు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ బాబుకు సరిగా మాట్లాడటం అయితే రాదు కానీ, అహంభావంతో మాత్రం మాట్లాడుతూ అపకీర్తి మూటగట్టుకుంటున్నాడు.

TDP Lokesh Using Big Words About His Minister Post-

TDP Lokesh Using Big Words About His Minister Post

నేను 34 సంవత్సరాల వయసులోనే మంత్రిని అయ్యాను అని లోకేష్‌ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయితే ఆ వయసుకు మంత్రి అవ్వడం ప్రపంచ వింత అయినట్టు లోకేష్ ఫీల్ అయిపోతున్నాడు. అదీ కాకుండా చాలా కిందస్థాయి నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చినట్టు లోకేష్ ఇస్తున్న బిల్డప్ అంతా ఇంతా కాదు. ఈయన ఎలా మంత్రి అయ్యింది అందరికీ తెలిసిందే. కనీసం ఎన్నికల్లో పోటీ చేసి గెలవకుండా నామినేటెడ్ పదవి అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యాడు లోకేష్.చంద్రబాబు నాయుడు కొడుకు కాకపోయి ఉంటే లోకేష్ కు ఈ పదవి దక్కేదా ? మంత్రి అయ్యేవాడా అనే ప్రశ్న ఎదురవవుతుంది.

లోకేష్ దొడ్డిదారిలో మంత్రి అయ్యాడు.. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లోకేష్ కి లేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శించడం లోకేష్ కి అవమానంగా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. కాకపోతే ఈజీగా నెగ్గగలిగే నియోజకవర్గం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పటికీ దాని మీద లోకేష్ కు క్లారిటీ రాలేదు. అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా లోకేష్ కు ఉందా అనే సందేహం అందరిలోనూ ఉంది. తాము వేసిన రోడ్ల మీద వైఎస్సార్సీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు యాత్రలు చేస్తున్నారని లోకేష్ ఒకటికి వంద సార్లు చెబుతున్నాడు. దీని మీద సోషల్ మీడియా లో విమర్శల బాణాలు వస్తున్నాయి. అద్వానంగా ఉన్న రోడ్ల ఫోటోలు పెట్టి ఇవేనా సింగపూర్ రోడ్లు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.