ఆ విష‌యంలో ప‌వ‌న్‌లాగే చేస్తున్న లోకేష్‌.. మ‌ళ్లీ విమ‌ర్శ‌ల పాలు

Tdp Lokesh Is Doing The Same As Pawan In That Regard Again

ఏపీ రాజ‌కీయాల్లో టీడీపీ వ్య‌వ‌హారం రోజు రోజుకూ మ‌రింత హాట్ టాపిక్ అవుతోంది.అస‌లు ఆ పార్టీ నేత‌ల‌కు ఏమైంది.

 Tdp Lokesh Is Doing The Same As Pawan In That Regard Again-TeluguStop.com

ఎందుకిలా చేస్తున్నారంటూ నెటిజ‌న్లు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.ఇప్ప‌టికే లోకేష్ లాంటి వారు నోరు జారుతున్నార‌నే విమ‌ర్శ‌ల‌కు తోడు ఏకంగా సీఎంను ప‌ట్టుకుని తిట్లు తిట్ట‌డంతో టీడీపీ అగ్గి రాజేస్తోంది.

ఇవ‌న్నీ చూస్తుంటే ఎలాగోలా జ‌నాల్లో నానాల‌నే త‌ప‌న ఆ పార్టీ నేత‌ల్లో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది.వీట‌న్నిటినీ బేరీజు వేసుకుంటే లోకేష్ ప్ర‌వ‌ర్త‌న ఇప్పుడు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది.

 Tdp Lokesh Is Doing The Same As Pawan In That Regard Again-ఆ విష‌యంలో ప‌వ‌న్‌లాగే చేస్తున్న లోకేష్‌.. మ‌ళ్లీ విమ‌ర్శ‌ల పాలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయ‌న చేస్తున్న రాజ‌కీయాలు చివ‌ర‌కు తెలుగు త‌మ్ముళ్ల‌కే విసుగు పుట్టిస్తున్నాయి.ఒకే మాట మీద నిల‌బ‌డితేనే ప్ర‌జ‌లను, కార్య‌క‌ర్త‌ల‌ను ఆక‌ర్సించ‌వ‌చ్చ‌నే సిద్ధాంతాన్ని లోకేష్ మ‌ర్చిపోతున్న‌ట్టు క‌నిపిస్తున్నారు.ఘ‌న చ‌రిత్ర ఉన్న రాజకీయ పార్టీకి భావి వార‌సుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టినా ఆ స్థాయిలో రాణించ‌లేక‌పోతున్నారు నారా లోకేష్. రీసెంట్ గా జనాల్లోకి బాగానే వ‌స్తున్న నారా లోకేష్‌.

ప్ర‌తీ సారీ అలాగే చేస్తే పార్టీల ప‌ట్టు పెరుగుతుంద‌నే విష‌యాన్ని మ‌ర్చిపోతున్నారు.ఏదో రావాలి అన్న‌ట్టు వ‌చ్చేసి మ‌ళ్లీ వెళ్లిపోతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆయ‌న చేస్తున్న ప‌నులు ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగే అనిపిస్తున్నాయి.

Telugu Ap Politics, Chandrababu Naidu, Jagan, Janasena, Lokesh, Nara Lokesh, Pawan Kalyan, Tdp, Tdp Leaders, Telugu Desam Party, Twitter, Ycp-Telugu Political News

ఎందుకంటే ఏదో ఆవేశం వచ్చినపుడు మాత్ర‌మే జ‌నాల్లోకి వ‌స్తున్నారు.ప్ర‌తి స‌మ‌స్య‌కు జ‌నాల్లోనే ఉండి వాయిస్ వినిపించాల‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి మ‌ళ్లీ ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం అయిపోతున్నారు.గ‌తంలో ప‌వ‌న్ కూడా ఇదే విధంగా ఏదో మొక్కుబ‌డిగా ప్ర‌జ‌ల్లోకి వచ్చి మ‌ల్లీ చాలా రోజుల దాకా ట్విట్ట‌ర్ ద్వారానే ప్ర‌శ్నించేవారు.

ఇప్పుడ లోకేష్ కూడా ఏదో ఒక విష‌యం ప్ర‌జ‌ల్లో నాని న‌ప్పుడే వ‌స్తున్నారు త‌ప్ప స్వ‌యంగా ఆయ‌నే ఓ విష‌యాన్ని భుజాన వేసుకుని పోరాటాల‌కు దిగ‌లేక‌పోతున్నారు.దీనిపై తెలుగు త‌మ్ముల్లు కూడా నిరాశ‌లో ఉన్నారు.

.

#Chandrababu #Lokesh #Jagan #Janasena #AP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube