ఆ భయంతో టీడీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారా ?

అధినేత ఎంత ధైర్యం చెబుతున్నా తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు ఒక పట్టాన నిద్ర పట్టడంలేదు.గతంలో తాము అధికారంలో ఉండగా వైసీపీకి చెందిన వారిని రకరకాలుగా అడ్డుకున్నామని ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తమను వెంటాడి కేసుల్లో ఇరికిస్తారనే భయం టీడీపీ నాయకుల్లో పెరిగిపోయినట్టు కనిపిస్తోంది.

 Tdp Leadersafraid Of Ycpparty 1-TeluguStop.com

ప్రస్తుతం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీకి తమ్ముళ్ల భయం మరింత ఆందోళన కలిగిస్తోంది.ఆ పార్టీకి చెందిన ఓ స్థాయి నాయకులు కూడా కేసుల బారిన పడడం, మరికొంతమంది అదే బ్యాయంతో ఆజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరో వైపు గ్రామాల్లో దాడులతో పాటు క్యాడర్‌ను చెల్లాచెదురు చేసే ప్రక్రియకు వైసీపీ నడుంబిగించింది అనే ఆందోళనతో మెజార్టీ నాయకులు యాక్టివ్ గా ఉండేందుకు వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

Telugu Ap Cm, Chandrababu, Tdp, Tdp Afraid Ycp, Ysjagan-Telugu Political News

అయితే తమ పార్టీ నాయకులు ఆందోళనను చంద్రబాబు లైట్ గానే తీసుకుంటున్నారు.ఎవరూ ఏ విధమైన భయాందోళనకు గురికావొద్దని, పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ క్యాడర్ కు అందుబాటులో ఉండి క్యాడర్ కు అండగా ఉండాలని గ్రామాల్లో పర్యటించాలని, బాబు సూచిస్తున్నా తమ పరిస్థితే దారుణంగా ఉందని వారు పట్టించుకోవడం మానేశారు.పల్నాడులో జననేతలని చెప్పుకున్న వారు తమను తాము రక్షించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

దాంతో టీడీపీ నేత అధినేత నేరుగా రంగంలోకి దిగి క్యాడర్ కు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడంలేదు.ఈ నేపథ్యంలో ఇటీవల గుంటూరులో దాడులకు గురై ఊళ్లు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిన టీడీపీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పోలీసుల పనితీరుపైనే బాబు తీవ్ర విమర్శలు చేశారు.పోలీసులు శిబిరానికి వచ్చి మాట్లాడి బాధితులను తీసుకెళ్లాలంటూ బాబు డిమాండ్ చేశారు.

అరెస్టు చేస్తే జైళ్లలో ఉంటాం కానీ పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.చట్టాన్ని గౌరవించకుంటే పోలీసుల్ని బాధ్యుల్ని చేస్తూ ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు.

వైఎస్ కంటే దారుణంగా జగన్ వ్యవహరిస్తున్నారని బాబు విమర్శలు గుప్పిస్తున్నారు.అంతే కాదు జగన్ కు ధైర్యం ఉంటే తనపై దాడి చేయాలంటూ బాబు సవాల్ విసిరారు.

తమ పార్టీ తిరుగుబాటు చేస్తే జైళ్లు సరిపోవని హెచ్చరించారు.బాధితుల ఊళ్లలో తానే ఉంటానంటూ బాబు చెప్పుకొచ్చారు.ఇప్పటివరకు ఏడుగురిని హత్య చేశారన్న చంద్రబాబు.22 మందిపై భౌతిక దాడులు చేశారని గుర్తుచేశారు.టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బాబు ఎంత ధైర్యం చెబుతున్నా నాయకుల్లో మాత్రం భయం ఇంకా తగ్గినట్టు కనిపించడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube