నిన్న మొన్నటి వరకు రాయలసీమ ప్రాంతాల్లో పర్యటించిన ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు.జరగబోయే ఎన్నికల విషయంలో అధికారులకు పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లతో మరియు ఉన్నత అధికారులతో భేటీ అవుతున్నారు.
ఇదే క్రమంలో భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న దాని విషయంలో కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు.
పరిస్థితి ఇలా ఉండగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని నిమ్మాడలో వైసీపీ పార్టీ నేతలు దారుణంగా విమర్శించడం దాన్ని తప్పుపడుతూ టిడిపి పార్టీ నాయకులు వర్ల రామయ్య ఎమ్మెల్సీ అశోక్ బాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఫిర్యాదు చేశారు.అంతమాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర లో కొన్ని గ్రామాలలో ఏకగ్రీవాలు అవటానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలు పెడుతున్నారని ఆ ప్రాంతాలలో కేంద్ర బలగాలు మోహరింపు చేయాలని కోరారు.దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా మారింది.