టీడీపీకి ప్రతిపక్ష హోదా గండం ? వైసీపీ వైపు ఎమ్మెల్యేల చూపు ?  

Tdp Leaders To Join Ycp - Telugu Balineni Srinivas Reddy, Chandrababu, Jagan, Tdp, Tdp Leaders, Ycp

గత కొద్ది రోజులుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది.అధికార పార్టీని ఇరుకున పెట్టే విషయంలో టీడీపీ పై చేయి సాధిస్తోంది.

 Tdp Leaders To Join Ycp

కరోనా విషయంలోనూ, విద్యుత్ బిల్లులు, విశాఖ ఎల్జీ పాలిమార్స్ దుర్ఘటన, ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి విషయంలోనూ అధికార పార్టీని అడ్డుకుంటూ ప్రజల్లో ఆ పార్టీ పరువు పోయే విధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోంది.అంతేకాకుండా ప్రజల్లో ఏ ఏ విషయాల పై అసంతృప్తి ఉందో ఆ విషయాలను గుర్తించి హైలెట్ చేస్తూ, టిడిపి అధికార పార్టీపై పై చేయి సాధిస్తోంది.

ఒకపక్క అమరావతిలో దీక్షలు చేస్తూనే, మరో పక్క విద్యుత్ బిల్లులు, ప్రజా సమస్యల విషయంలో టిడిపి నాయకులు తమ తమ ఇళ్ల నుంచే నిరసన దీక్షలు చేస్తూ, అధికార పార్టీని చిక్కుల్లో పెడుతున్నారు.టిడిపి దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే , రాజకీయంగా ఇబ్బందులు పడతామనే ఆలోచనకు వచ్చిన వైసిపి ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది.

టీడీపీకి ప్రతిపక్ష హోదా గండం వైసీపీ వైపు ఎమ్మెల్యేల చూపు -Political-Telugu Tollywood Photo Image

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వరకు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు వైసీపీలో చేరారు.ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడడం, ఆ తర్వాత కరోనా విధించడం వంటి కారణాలతో వైసీపీలోకి చేరికలు నిలిచిపోయాయి.

మరి కొంతకాలం పాటు ఈ చేరికలను వాయిదా వేయాలని ముందుగా భావించినా, ప్రస్తుత తరుణంలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీయడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చింది.ఇప్పటికే టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులు ఇప్పుడు వైసిపిలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నారు.తెలుగుదేశం పార్టీలో ముందు ముందు నాయకత్వ సమస్య ఏర్పడే అవకాశం ఉండడంతో, టిడిపి ఎమ్మెల్యేలు చాలా మంది అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ముందుగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు తో పాటు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఈ నెల 27వ తేదీ లోపు వైసీపీలో చేరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం.వీరే కాకుండా నియోజకవర్గస్థాయి నాయకులు చాలామంది ఇప్పుడు వైసీపీలో చేరాలని చూస్తున్నారు.

ఇక విశాఖ జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు సైతం వైసీపీలోకి వచ్చేందుకు మంతనాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.మొత్తంగా నలుగురైదుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేయాలని చూస్తున్నారట.వీరంతా అధికారికంగా పార్టీలో చేరకపోయినా, బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు , అనధికారికంగా వైసీపీ సభ్యులు గా ఉండేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి.23 మందిలో ఇప్పటికే ముగ్గురు పార్టీకి దూరమయ్యారు.మరో ముగ్గురు కనుక ఆ పార్టీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది.

అందుకోసమే ఇప్పుడు వైసిపి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసినట్లు తెలుస్తోంది.దీని ద్వారా తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పెట్టాలని వైసిపి ప్లాన్ చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Leaders To Join Ycp Related Telugu News,Photos/Pics,Images..