బాబు సంచలన నిర్ణయం .. వణికిపోతున్న తమ్ముళ్లు ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ తెలుగు తమ్ముళ్ళ తో పాటు, అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు.బాబు నిర్ణయాలు ముందు సంచలనం గానే కనిపించినా, అంతిమంగా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేవి గానే ఉంటాయి.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోరంగా దెబ్బతింది.టీడీపీ ఆవిర్భావం తరువాత ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళలేదు.

 Tdp Leaders In Tension Due To Chandra Babu Decision, Tdp, Chandrababu, Jagan, Y-TeluguStop.com

ఎప్పుడూ ఏదో ఒక పార్టీ తో పొత్తు పెట్టుకునే ఎన్నికల్లో పోటీ చేశారు.మొదటి సారి ఒంటరి ప్రయత్నం బెడిసి కొట్టడంతో మళ్లీ ఆ ప్రయోగం చేయకూడదు అనే నిర్ణయానికి వచ్చిన బాబు బీజేపీ జనసేన తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు.

కానీ బిజెపి బాబుని ఆయన పార్టీనీ తమ దరిదాపుల్లోకి రాకుండా చూసుకొంటున్నారు.ఇప్పటికే టీడీపీ భవిష్యత్తు లోనూ పొత్తు ఉండదు అని ప్రకటించేశారు.

అయినా బాబు లో పొత్తు ఆశలు మాత్రం పోలేదు.
  ఎన్నికల సమయం నాటికి తప్పనిసరిగా బిజెపి జనసేన కూటమితో జత కట్టగలము అనే ఆశ బాబు లో ఎక్కువగా కనిపిస్తోంది.

అందుకే బీజేపీ ని వదలకుండా వెంటపడుతూనే ఉన్నారు.అంతే కాదు బీజేపీ జనసేన తో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే లెక్కలు కూడా వేసేసుకున్నరాట.

గతం కంటే ఎక్కువగా అంటే సుమారు 60 నుంచి 70 స్థానాలను బీజేపీ కూటమికి కేటాయించేందుకు బాబు సిద్ధం అయిపోవడం ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు మింగుడు పడడం లేదు.

Telugu Ap, Bjp, Chandrababu, General, Jagan, Lokesh, Pawan Kalyan, Somu Veerraju

అసలు బాబు ఏ ఏ నియోజక వర్గాలను బీజేపీ కి కేటాయించాలి అనుకుంటున్నారు అనే విషయం తెలియక తికమక పడిపోతున్నారు.
  ఇప్పటికే బాబు నిర్ణయాల కారణంగా ఎంతో నష్టపోయాము అని, ఇప్పుడు అన్ని సీట్లు పొత్తుల్లో భాగంగా ఇచ్చేస్తే ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అనే అనేక విషయాలపై తమ్ముళ్లు ఆందోళనలో ఉన్నారట.ఇప్పటికే బిజెపి పై జనాల్లో ఆగ్రహం పెరిగిపోయిందని, ఎన్నికల నాటికి అది మరింతగా పెరుగుతుంది అనేది తమ్ముళ్ళ వాదన.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube