జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తున్న టీడీపీ నేత‌లు..

ఆంధప్రదేశ్‌‌ రాజకీయాలు ఇటీవల జరిగిన పరిణామాలతో హాట్ హాట్‌గా ఉన్నాయి.అసెంబ్లీలో వైసీపీ సభ్యులు తన కుటుంబాన్ని, భార్యను అవమానించేలా మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్ పెట్టి మరి కంటతడి పెట్టుకున్నారు.

 Tdp Leaders Targeting Junior Ntr. Jr Ntr, Tdp , Ap Poltics , Chnadra Bbau , Bhuw-TeluguStop.com

దీంతో నందమూరి కుటుంబసభ్యులు పలువురు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చాడు.

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ ఘటనను ఖండిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.తారక్ చేసిన ఈ పనే టీడీపీ నాయకులకు నచ్చలేదని తెలుస్తున్నది.

అప్పటి నుంచి ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు టార్గెట్ చేశారు.ఇప్పుడు ఈ విషయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.మేనత్తను నోటికచ్చినట్టు మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని టీడీపీ నాయకులు అంటున్నారు.ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.

నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడితే మేనల్లుడిగా ఎన్టీఆర్ సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని పేర్కొన్నారు.వీడియోలో ఎన్టీఆర్ స్పందన వింటే.

ప్రవచనాలు చెప్పినట్టు ఉందని, ఈ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని ఆయన ఎద్దేవా చేశారు.

Telugu Ap Poltics, Assembly, Bhuwawari, Buddha Venkanna, Chnadra Bbau, Jr Ntr, V

సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని అన్నారు.హరి కృష్ణ బతికే ఉంటే.ఇంకో రకంగా ఉండేది అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ అలా ఎందుకు చేయలేదని మండిపడ్డారు.తారక్‌పై వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమర్థించారు.

అయితే, జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు అటాక్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.టీడీపీ నాయకులు ఈ రకంగా తారక్‌ను టార్గెట్ చేయడం‌తో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి.

మరోవైపు, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న వంటి నేతలు చంద్రబాబు, నారా లోకేశ్‌కు సన్నిహితులు కావడంతో జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయడం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదు.టీడీపీ అధినాయకత్వం మేరకు నాయకులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిందా? అనే టాక్ మొదలైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube