పొత్తు లేకపోతే కష్టం .. జనసేన తో నష్టం ?

జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంతోంది లేదో తెలియదు కానీ, అప్పుడే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందనే హడావుడి అయితే ప్రస్తుతం నడుస్తోంది.అసలు బిజెపి జనసేన పార్టీల పొత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.

 Tdp Leaders So Many Douts About Janasena Aliance Janasena, Tdp, Ap, Ap Politics,-TeluguStop.com

ఈ రెండు పార్టీలు ఎన్నికల వరకు తమ పొత్తును కొనసాగిస్తాయో లేదో ఇంకా ఒక క్లారిటీ లేదు.అయినా టిడిపి మాత్రం జనసేన తో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటుందనే అభిప్రాయంతోనే ఉంది.

మానసికంగాను టిడిపి నాయకులు జనసేన తో పొత్తు పెట్టుకుంటే తప్ప గెలవలేము అనే అభిప్రాయానికి వచ్చేశారు.ఆ విధంగా పార్టీల నాయకులు ఫిక్స్ అయిపోయారు.

తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మళ్లీ ఎన్నికలకు వెళ్తే ఖచ్చితంగా పరాభవం తప్పదు కాబట్టి పొత్తు ఉండాల్సిందే అనే అభిప్రాయం టిడిపిలో వచ్చేసింది.

అందుకే జనసేన తో పొత్తు కోసం భారీ స్థాయిలో ఆపార్టీకి సీట్లను కేటాయించేందుకు టిడిపి సిద్ధంగానే ఉంది.

దాదాపు 40 వరకు స్థానాలను జనసేనకు కేటాయిస్తారని ప్రచారం చాలా రోజుల నుంచి వస్తూనే ఉంది.అయితే ఈ పొత్తు కారణంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీనే అనే అభిప్రాయం ఇప్పుడు టిడిపిలో మొదలైంది.

జనసేన కు కేటాయించిన నియోజకవర్గాలు కాకుండా, మిగతా చోట్ల టిడిపి అభ్యర్థులకు జనసేన నుంచి సహకారం ఎంత ? కాపు సామాజిక వర్గం ఓటర్లు టిడిపి వైపు టర్న్ అవుతారా లేదా ? అనే అనుమానాలు ఇప్పటి నుంచే వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ap, Jagan, Janasena, Janasenani, Rayalaseema, Tdpjanasena, Yrcp-Telugu Po

జనసేన టీడీపీ పొత్తుపై ప్రభావం గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటుందని, కానీ రాయలసీమలో ఆ ప్రభావం అంతంత మాత్రంగా ఉంటుందని కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మొత్తంగా జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల టిడిపి నష్టపోతుందని, అదే సమయంలో ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి తప్పదు అనే అభిప్రాయంలోనూ ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube