ముఖ్యమంత్రి, మంత్రులుఏంచేసినా, గవర్నర్ నిండుసభలో అబద్ధాలు, అసత్యాలు వల్లేవేస్తున్నా తాముచూస్తూ ఊరుకోవాలా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చెప్పినట్లు స్పీకర్ నడుచుకుంటున్నారు.
రాజ్యాంగప్రతినిధిగా ఉన్నవ్యక్తే, రాజ్యాంగవిలువలకు తూట్లుపొడుస్తున్న పాలకుల చర్యలను సమర్థిచడంసిగ్గుచేటు.
అసెంబ్లీలో తమ గొంతు నొక్కేయగలరుకానీ, ప్రజాక్షేత్రంలో కాదుగా.టీడీపీరాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు : గవర్నర్ కే తెలియకుండా ఏపీప్రభుత్వం అప్పులు తీసుకొచ్చి, వాటిని తనస్వార్థానికి వాడుకుంది.తనపేరుని కూడా అప్పుల కోసం ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేసిన తీరుపై ఏపీ గవర్నర్ స్పందించకపోవడం విచారకరం.
బాధ్యతగలప్రతిపక్షంగా తాము వాస్తవాలను ఆయనకు విన్నవించినా, ఆయన స్పందించలేదు.నిబంధనలు, రాజ్యాంగానికి విరుద్ధంగా జగన్ ప్రభుత్వం అనేక పనులుచేస్తోంది.గతంలో రాత్రికి రాత్రే ఎన్నికల కమిషనర్ పై వేటు వేసింది.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పై దాడిజరిగితే, స్వయంగా ఛైర్మన్ గారే గవర్నర్ కు విన్నవించినా ఆయన స్పందించలేదు.మండలిలో స్వయంగా ఛైర్మన్ పై దాడిజరిగినప్పుడుకూడా గవర్న ర్ లో చలనం లేదు.
ఇలా అనేక అంశాల్లో రాష్ట్ర గవర్నర్ తీరు చాలాచాలా అభ్యంతరకరంగా సాగింది.అసెంబ్లీలో ప్రతిపక్షం, ప్రజల ఆమోదంతో గతప్రభుత్వం సీఆర్డీఏ చట్టాన్ని రూపొందిస్తే, దాన్ని ఈ ప్రభుత్వం రాత్రికిరాత్రే రద్దుచేసినా గవర్నర్ అలాఎలా చేస్తారని ఏనాడూ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు.
పైగా ప్రభుత్వం తీసుకొచ్చిన మూడురాజధానుల బిల్లుపై గవర్నర్ గుడ్డిగా సంత కం చేశారు.మూడురాజధానుల బిల్లువిషయంలో గవర్నర్ తప్పుచేశారని సాక్షాత్తూ న్యాయస్థానమే వ్యాఖ్యానించింది.
సభలో కానీ, బయటకానీ జరిగిన అనేకపరిణామాలపై, ప్రభుత్వం రాజ్యాం గ వ్యవస్థలను నాశనం చేస్తున్న తీరుపై గవర్నర్ కు మొరపెట్టుకు న్నా,వినతిపత్రాలు ఇచ్చినా ఆయనఏనాడూ స్పందించలేదు.పైగా నేడు అసెంబ్లీ సమావేశాలప్రారంభోపన్యాసంలో అంతా బాగుం దని, ఈప్రభుత్వ పనితీరుని సమర్థిస్తూ మాట్లాడటం సిగ్గుచేటు.
గవర్నర్ ప్రసంగం ఆసాంతం ప్రభుత్వనిర్ణయాలను సమర్థిస్తూ, రాజ్యాంగవిలువలకు తూట్లుపొడిచేలా సాగింది.గవర్నర్ ప్రసంగం ఆసాంతం తప్పులతడక, అబద్ధాలపుట్టే.
దాన్ని సమర్థిస్తే తాము ప్రభుత్వచర్యలను, ప్రజావ్యతిరేకనిర్ణయాలనుసమర్థించినట్టే.కాబట్టే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ అసెంబ్లీని టీడీపీ సభ్యు లందరం బాయ్ కాట్ చేశాము.
అధికారంలోఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, టీడీపీ ఎప్పుడూ ప్రజలపక్షమే.ప్రజల సమస్యలను ప్రభు త్వానికి అర్థమయ్యేలాచెప్పాలని, రాష్ట్రం నాశనమవుతున్న తీరుని పాలకులకళ్లకుకట్టేలా వివరించాలనే సభకు హజరయ్యా ము.గవర్నర్ ప్రసంగంపై తమఅభ్యంతరాలను తెలియచెప్పడానికి తాము స్పీకర్ ని సమయం అడిగితే, ముఖ్యమంత్రి జోక్యంచేసుకొని తాముతప్పులు మాట్లాడుతున్నామన్నారు.ముఖ్యమంత్రి చెప్పిందే తాము మాట్లాడాలా.
ఎక్కడైనా ప్రజాస్వా మ్యంలో అలాజరిగిందా? టీడీపీసభ్యులమైన మేము ప్రజలపక్షాన వాస్తవాలు మాట్లాడతాము.అవి వాస్తవాలుకాదని పాలకపక్షం సభలో వాస్తవాలతో నిరూపించాలి.
అంతేగానీ, తాము తప్పులు మాట్లాడతామని ముఖ్యమంత్రి, మంత్రులు ఎలాచెబుతారు? ప్రతిపక్షసభ్యులుగా తాములేవనెత్తేవాటిపై అధికారంలోఉన్నవారి గా సమాధానంచెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి, మంత్రులకు ఉంది.అదిచేయకుండా తాము మాట్లాడకూడదనిచెప్పడం, స్పీకర్ కు చెప్పి ప్రసంగాన్ని అడ్డుకోవడం దురదృష్టకరం.
అసెంబ్లీ సమావేశాల ప్రసారానికి కొన్ని ఛానెళ్లకే ఎందుకు అనుమతి ఇచ్చారు.మీడియాగొంతునొక్కేయడానికి జీవోనెం 2430 ఎందుకు తీసుకొచ్చారు? అసెంబ్లీ జరుగుతుంటే ప్రతిపక్ష సభ్యుల ముఖాలుకూడా ఛానెళ్లలోచూపించకుండా ఎందుకు అడ్డు కుంటున్నారు? ఇవన్నీఆలోచించే తమవేదన, బాధ అధికారపక్షం పట్టించుకోవడంలేదనే, తమగొంతునొక్కేస్తుందనే సమావేశాలు బహిష్కరించాము.సమావేశాల తొలిరోజే ప్రతిపక్షం గొంతునొక్కే యాలని పాలకపక్షం చూడటం బాధాకరం.
ఇటువంటి దుర్మార్గపు విధానాలు ఈ ముఖ్యమంత్రికి, ఈప్రభుత్వానికే చెల్లాయి.బీఏసీ సమావేశంలో తాము ప్రజలపక్షాన లేవనెత్తాల్సిన అంశాలను ప్రస్తావించాము.
వాటన్నింటిపై చర్చజరిగేలా చూడాల ని కోరాము.కానీ అధికారపక్షం వారు మీరు 10మందే ఉన్నారు.15 మందే ఉన్నారుకాబట్టి, మీకు 10నిమిషాలకంటే ఎక్కువ సమయం ఇవ్వడం కుదరదన్నారు.ప్రజాస్వామ్యంలో ఇటువంటి ఆలోచనలకు తావులేదు.
రాజ్యాంగవ్యవస్థలో రాష్ట్రానికి పెద్దగా ఉన్న గవర్నర్ గారే మూడేళ్లనుంచి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేకకార్యకలాపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే ఎలా? గవర్నర్ గారే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే తాము చూస్తూఊరుకోవాలా? గవర్నర్ ప్రసంగంపై ప్రజాస్వామ్యబద్ధంగా నే తాము నిరసనవ్యక్తంచేశాముకానీ, ఎక్కడా హద్దులుమీరలేదు.గవర్నర్ గారి వయస్సుని గురించి మాట్లాడుతున్న వారు చంద్ర బాబుగారి వయస్సెంతో, ఆయన్నిఎందుకు అంతలా సభలోబాధ పెట్టారోకూడా సమాధానంచెప్పాలి.
చంద్రబాబుగారిని అవమానించి నప్పుడు,సభకుఏమాత్రం సంబంధంలేని ఆయన సతీమణిని సభ లో అనరాని మాటలన్నప్పుడు వైసీపీవారికి సభ్యతా,సంస్కారాలు గుర్తుకురాలేదా? ఆనాడు సభలో అనాల్సినవన్నీ అనేసి, తిరిగి బయటకువచ్చాక తామేమీ అనలేదంటూబుకాయించారు.రికార్డు లు బయటపెట్టమంటే స్పందించలేదు.
తామునేడుసభలో అవాస్త వాలు మాట్లాడితే అధికారంలోఉన్నవారు వాస్తవాలు చెప్పొచ్చు కదా ? మంత్రి బొత్సగారి ఎంతతక్కువమాట్లాడితే అంతమంచిది.ఏపీ హైకోర్ట్ త్రిసభ్యధర్మాసనం అంతస్పష్టంగా రాజధానిపై తీర్పు చెప్పా కకూడా బొత్స అమరావతిని గురించి అవగాహనలేకుండా మాట్లా డితే ఏంచెప్పాలి? మంత్రిగా ఉన్నవ్యక్తికి కూడా న్యాయస్థానాలపై, అవిచ్చిన తీర్పులపై అవగాహన లేకపోతేఎలా? ఇప్పటికైనా బొత్సగారికి ఆయనం మాట్లాడుతున్నారో కనీసం మీరైనా చెప్పండి.విశాఖపట్నానికి కాకపోతే, మరలా హైదరాబాద్ కు వెళ్లి అక్కడకూర్చొని పాలనచేయమనండి.
మేం వద్దంటే ఆగుతారా? తాముగతంలో హైదరాబాద్ లో కూర్చొని పాలన చేయడం సిగ్గుచేటని భావించే అమరావతికి వచ్చాము.ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నచంద్రబాబుగారు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా, తనరాష్ట్రాన్ని,తనప్రజలను బాగుచేసుకోవాలన్న తలంపుతో బస్సులోకూర్చొని పాలనచేశారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి గారు (టీడీపీ శాసనసభ్యులు) : దేశంలో రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యతను తమభుజస్కంధాలపై వేసుకొని, రాష్ట్రాలకురాజ్యాంగం ప్రతినిధులుగా గవర్నర్లు వ్యవహరి స్తుంటారు.విధినిర్వహణలో ఏపీగవర్నర్ పూర్తిగా వైఫల్యం చెందా రు.కాబట్టే, తెలుగుదేశం సభ్యులమైన తాము గవర్నర్ ప్రసంగా న్ని నిరసిస్తూ సభనుంచి వైదొలిగాము.రాష్ట్రం అప్పులమయమై నా, రాజ్యాంగవిలువలను తుంగలో తొక్కుతున్నా, ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నా.
రాష్ట్రాన్ని దివాళాతీస్తున్నా గవర్న ర్ పట్టించుకోకపోతే ఎలా? అధికారంలోఉన్నవారు తమఇష్టాను సారం ప్రవర్తిస్తూ, రాజ్యాంగవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, పౌరు లను, ప్రజాస్వామ్యవాదులను, ప్రతిపక్షాలను ఇబ్బందులకుగురి చేస్తున్నప్పుడుకూడా రాష్ట్రప్రథమ పౌరుడు స్పందించకపోవడం నిజంగా దుర్మార్గమే.ప్రశ్నించాల్సిన గవర్నర్ గారే తనకేమీ పట్ట నట్టు కూర్చుంటే ఎవరుస్పందించాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అవినీతిపరులైన అధికా రులకు ప్రభుత్వంఇష్టానుసారం పోస్టింగ్ లుఇస్తున్నా స్పందించ రా? ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను గుడ్డిగా సమర్థిస్తూ, అన్ని ఫైళ్లపైసంతకాలుచేసుకుంటూ పోవడానికేనా గవర్నర్ అనేవ్యక్తి ఉంది? ప్రభుత్వంచేసే తప్పులను గవర్నర్ ప్రశ్నించకపోతే ఎలా? తమప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీసహా, బీజేపీ వారికి, ఇతరు లకు అసెంబ్లీలో సమానంగా మాట్లాడే అవకాశంఇచ్చాము.ఈ ముఖ్యమంత్రిలా ప్రతిపక్షాలగొంతునులిమి, సభ్యులపై దాడులు చేసే సంస్కృతిని ప్రోత్సహించలేదు.
ముఖ్యమంత్రి చెప్పినట్టు స్పీకర్ నడుచుకుంటున్నాడు.ముఖ్యమంత్రేమో అసెంబ్లీ కూడా తన పులివెందుల సామ్రాజ్యంలా ఫీలవుతున్నాడు.5కోట్ల ప్రజల సమస్యలనుపరిష్కరించే వేదికని గుర్తించలేకపోతున్నాడు.నీ ఆలోచనా విధానం తప్పునాయానా అని మేం ముఖ్యమంత్రిని అంటే వెంటనే బయటకుపంపించమంటాడు.
అసెంబ్లీలో అయితే మా గొంతునొక్కగలరుకానీ, ప్రజాక్షేత్రంలో ఏం ఆపుతారు? గవర్న ర్ ప్రసంగం మొత్తం అవాస్తవాలే.కేంద్రప్రభుత్వపథకాలు, నిధులు పక్కదారి పట్టించినా, గవర్నర్ రాష్ట్రపాలకులనుప్రశ్నించకపోతే ఎలా? గవర్నర్ ఏపీప్రభుత్వంచేతిలో ఉత్సవవిగ్రహంలా మారారు కాబట్టే, తాము సభను బహిష్కరించాము.రాష్ట్రంలో ఏవర్గం ప్రజలై నా సంతోషంగా ఉన్నారా? యువత, రైతులు,మహిళలు, విద్యా ర్థులు, ఉద్యోగులు అందరూ ప్రభుత్వంపై వ్యతిరేకతతోఉంటే, గవర్నర్ గారు అంతాబాగుందని ప్రసంగాలు చదివడం బాధాకరం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy