టీడీపీని ఖాళీ చేసే పని పెట్టుకున్న జగన్! అందుకే వరుస చేరికలు  

Tdp Leaders Ready To Join Ysrcp - Telugu Ap Cm Jagan, Ap Politics, Chandrababu, Join Ysrcp, Tdp Leaders

ఏపీ రాజకీయాలలో పార్టీల ప్రహసనం, రాజకీయ నాయకులు ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది.ఎ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు వలస పక్షుల మాదిరి వచ్చి చేరిపోతూ ఉంటారు.

 Tdp Leaders Ready To Join Ysrcp

మరల ఎన్నికల సమయంలో సీటు దొరకదని ఫిక్స్ అయిన తర్వాత పాత పార్టీలోకి తిరిగి వస్తారు.అత్తారింటికి వెళ్ళినంత సులభంగా ఈ రాజకీయ నాయకుల రాకపోకలు ఉంటాయి.

అయితే ఇలాంటి నేతలని చూస్తున్న ప్రజలు కూడా మారాల్సింది పోయి ఆ నాయకులతో పాటే మేము కూడా అనే విధంగా వారినే గెలిపిస్తూ వారు తప్ప నాయకులుగా మరో కొత్త రక్తం రాకూడదు అన్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు.

టీడీపీని ఖాళీ చేసే పని పెట్టుకున్న జగన్ అందుకే వరుస చేరికలు-Political-Telugu Tollywood Photo Image

గత ఎన్నికలలో టీడీపీ గెలవగానే వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరి కండువాలు కప్పుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు అదే పద్ధతిని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు.స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి చెందిన కీలక నాయకులు వైసీపీ గూటికి చేరిపోతున్నారు.టీడీపీలో మంచి ప్రాధాన్యత ఉన్నవారు కూడా తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ పక్కన చేరిపోతున్నారు.చంద్రబాబు మీద నాలుగు విమర్శలు చేస్తున్నారు.

రాయలసీమ నుంచి టీడీపీకి చెందిన రామ సుబ్భారెడ్డి, సతీష్ రెడ్డి లాంటి కీలక నేతలు వైసీపీలో చేరిపోయారు.ఇక ప్రకాశం జిల్లా నుంచి కదిరి బాబూరావు చేరిపోగా ఇప్పుడు కరణం బలరాం బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.

ఆయన కొడుకు వైసీపీ కండువా కప్పుకున్నారు.అలాగే విశాఖలో కూడా కీలక నేతలు వైసీపీ గూటికి చేరిపోయారు.

ఈ ప్రహసనం అంతా చూస్తూ ఉంటే.రాబోయే ఎన్నికల నాటికి టీడీపీ పార్టీని పూర్తిగా ఖాళీ చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇప్పుడు వారి రాజకీయ అవసరాల కోసం వైసీపీ గూటికి చేరిన వారు ఎన్నికల వరకు జగన్ తోనే ఉంటారా అనేది ఇప్పుడు సందేహాస్పదం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Leaders Ready To Join Ysrcp Related Telugu News,Photos/Pics,Images..