జేసీ బ్ర‌ద‌ర్స్ ఒంట‌ర‌య్యారే.. స్వ‌యంకృత‌మా..!  

TDP leaders Neglecting JC Brothers, JC brothers,TDP,40 years political industry,JC diwakar reddy,senior TDP leaders,Congress - Telugu 40 Years Political Industry, Congress, Jc Brothers, Jc Diwakar Reddy, Senior Tdp Leaders, Tdp, Tdp Leaders Neglecting Jc Brothers

అనంపురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్  ఒంట‌ర‌య్యారా?  దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం చివ‌రి అంకంలోకి వ‌చ్చే స‌రికి సాధించింది ఏమీక‌నిపించ‌డం లేదా? అంటే.ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

TeluguStop.com - Tdp Leaders Neglecting Jc Brothers

రాజ‌కీయాల్లో ఇన్నాళ్లు మ‌న‌గ‌ల‌గ‌డ‌మే గొప్ప విష‌యం అనుకున్నా.న‌లుగురు మంచి మిత్రుల‌ను కూడా మిగుల్చుకోవ‌డ‌మూ అంతే ముఖ్యం.

కానీ, జేసీ ఫ్యామిలీని చూస్తే.ఏ ఒక్క‌రూ ప‌ల‌క‌రించే ప్ర‌య‌త్నం కానీ.

TeluguStop.com - జేసీ బ్ర‌ద‌ర్స్ ఒంట‌ర‌య్యారే.. స్వ‌యంకృత‌మా..-Political-Telugu Tollywood Photo Image

జాలి ప‌డే ప్ర‌య‌త్నం కానీ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.
కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం ఉన్నారు.

అయినా. జిల్లాపై ఆధిప‌త్యం సాధించాల‌నే యావ‌తో ఎక్క‌డిక‌క్క‌డ నేత‌ల‌పై ఎదురు దాడులు.

ఆధిప‌త్య ధోర‌ణులు.వివాదాల‌తోనే కాలం గ‌డిపారు.

సొంతపార్టీలోనే ఎగ‌స్పార్టీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.దీంతో అంత పెద్ద కాంగ్రెస్‌లో జేసీల‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన వారు ఒక్క‌రంటే ఒక్క‌రు లేకుండా పోయార‌ని అంటారు ప‌రిశీల‌కులు.

రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ.త‌మ సొంత కోట‌రీ నిర్మించుకున్న‌ప్ప‌టికీ.

అంద‌రినీ కలుపుకొని పోవాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా.కానీ.

అలాంటి విధానాన్ని దివాకర్ రెడ్డి పాటించ‌లేద‌నేది ఇక్క‌డివారి వాదన‌.

ఇక‌, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు.ఇక్క‌డ కూడా ఈ కుటుంబాన్ని ప‌ట్టించుకునే నాథుడు లేకుండా పోయార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.ప‌ట్టించుకుంటే.

చంద్ర‌బాబు ప‌ట్టించుకోవాలి.లేదంటే.

లేదు.జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్లు కానీ.

టీడీపీ మాజీ మంత్రులు కానీ.జేసీ కుటుంబం వైపు క‌న్నెత్తి చూసే ప‌రిస్థితి లేదు.దీనికి కారణం.జేసీల స్వ‌యంకృత‌మే.మాక‌న్నా ఎవ‌రు గొప్ప‌! అనే ఆధిప‌త్య ధోర‌ణే! ఇటీవ‌ల పార్టీలో ప్ర‌క‌టించిన ప‌ద‌వుల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా జేసీ కుటుంబానికి ద‌క్కించు కోలేక పోయారంటే.ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.
పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం జిల్లా ప‌ద‌వుల్లో కానీ, టీడీపీ రాష్ట్ర‌, జాతీయ క‌మిటీల్లో కానీ.జేసీ వ‌ర్గానికి కానీ, ఆ కుటుంబానికి కానీ, చంద్ర‌బాబు చోటు పెట్ట‌లేదు.

క‌నీసం వారి పేరు , ఊరు కూడా ప‌రిశీల‌న‌లోకి రాలేద‌ని టాక్‌.దీంతో మొత్తంగా వీరిని ఒంట‌రిని చేశార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

ఏదేమైనా.ఇదంతా జేసీల స్వ‌యంకృత‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

#40Years #TDPLeaders #Congress #JC Brothers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Leaders Neglecting Jc Brothers Related Telugu News,Photos/Pics,Images..