జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన ఆ ప‌నులు లోకేష్ కు క‌లిసి వ‌స్తున్నాయా..?

ఒక‌ప్ప‌టి కంటే ఇప్పుడు లోకేష్ గ్రాఫ్ పెరుగుతోంద‌ని చెప్పాలి.అయితే ఎంత పెరుగుతున్నా కూడా లోకేష్‌కు బ‌లంగా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు మాత్రం క‌రువైంది.

 Nara Lokesh Fires On Jagan Govt Over Ramya Murder Case, Nara Lokesh,ys Jagan Govt, Guntur Ramya Murder Case, Tdp Leaders, Lokesh On Ramya Case-TeluguStop.com

జ‌నాల‌ను ఆక‌ట్టుకునేందుకు లోకేష్ చాలా మార్పులే చేసుకున్నారు.త‌న డ్రెస్సింగ్ స్టైల్ ద‌గ్గ‌రి నుంచి విమ‌ర్శ‌లు చేసే స్టైల్ వ‌ర‌కు ఆచితూచి అడుగులేస్తూ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పొందేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇక ఇన్ని చేస్తున్నా కూడా ఆయ‌న‌పై సానుభూతి ప‌ర‌మైన ఆద‌ర‌ణ క‌రువైంది.దీంతో ఆయ‌న ఇప్పుడు అనుకున్న ఆ ప‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వ‌మే చేసి పెట్టిన‌ట్టు అయింది.
గుంటూరులో రీసెంట్ గా జరిగిన బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో లోకేష్ వ్య‌వ‌హ‌రించిన తీరు ఆయ‌న‌కు ఆద‌ర‌ణ తీసుకొచ్చింది.ఈ విష‌యంలో ఆయ‌న దూకుడు చూపించ‌డంతో ఆయ‌ను పోలీసులు అరెస్టు చేయాల్సి వ‌చ్చింది.

 Nara Lokesh Fires On Jagan Govt Over Ramya Murder Case, Nara Lokesh,YS Jagan Govt, Guntur Ramya Murder Case, TDP Leaders, Lokesh On Ramya Case-జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన ఆ ప‌నులు లోకేష్ కు క‌లిసి వ‌స్తున్నాయా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని రకాలుగా లోకేష్ నాయుడు నిరసనలు తెలిపినా లేదంటే ఆందోళనలు చేసినా ఆయ‌న‌పై పెద్ద‌గా పోలీస్ కేసులు, లేదంటే నిర్బంధాలు, లేదంటే అరెస్టులు లేవు.దీంతో దీన్ని సాకుగా చూపించి లోకేష్ కు కేసులంటే భ‌య‌మ‌ని, అందుకే ఆయ‌న సైలెంట్ గా ఉంటార‌ని వైసీపీ నాయకులు ఇన్ని రోజులు చెప్పుకొచ్చారు.

ఇక ఇలాటి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ‌, యూత్‌ను ఆక‌ట్టుకునేందుకు మాస్ ఇమేజ్ ను తెచ్చుకునేందుకు లోకేష్ కూడా బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇక ఇదే క్ర‌మంలో ర‌మ్య కేసులో ఆయ‌న చూపించిన దూకుడు ఆయ‌న్ను అరెస్టు చేసేలా చేసింది.దీంతో పెద్ద ఎత్తున ఆయ‌న ప‌ట్ల సోష‌ల్ మీడియాలో మ‌ద్ద‌తు వ‌స్తోంది.ఇది టీడీపీ కార్య‌క‌ర్త‌ల్లో కూడా మంచి జోష్ నింపింది.ఈ విధంగా లోకేష్ ముందునుంచే ఉంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌పై ప్ర‌జ‌ల్లో కూడా బాగానే న‌మ్మ‌కం క‌లిగేది.మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన తీరు లోకేష్‌కు క‌లిసి వ‌స్తోంద‌న్న‌మాట‌.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube