లోకేష్ దూకుడుతో టీడీపీ లో వచ్చిన మార్పులేంటి ?  

nara lokesh, tdp ,ap ,amaravathi, ysrcp, jagan ,Ap government , Chandrababu, TDP Leaders - Telugu Amaravathi, Ap, Ap Government, Chandrababu, Jagan, Nara Lokesh, Tdp, Tdp Leaders, Ysrcp

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ దూకుడు పెంచారు.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉండడం, మరికొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ పగ్గాలు తాను చేపట్టే అవకాశం ఉండడంతో లోకేష్ మళ్లీ యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లుగా కనిపిస్తున్నారు.

TeluguStop.com - Tdp Leaders More Active On Lokesh Ap Tour

ఇప్పటి వరకు తనపై రాజకీయంగా వస్తున్న అనేక విమర్శలకు చెక్ పెట్టి, తాను చంద్రబాబు స్థాయిలోనే రాజకీయాలు చేయగలను అనే సంకేతాలను పార్టీ శ్రేణులతో పాటు, ప్రజల్లోనూ కలిగించే విధంగా తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని మరీ, లోకేష్ అమరావతి లో అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ చేపట్టిన అమరావతి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వంపై పోరాటం చేయగలను అని నిరూపించుకునేందుకు లోకేష్ గట్టిగానే కష్టపడుతున్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యల విషయమై సోషల్ మీడియా ద్వారా లోకేష్ ఎప్పటికప్పుడు ఎత్తి చూపిస్తూ, విమర్శలు చేస్తూ వస్తున్నారు.మొన్నటి వరకు హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితం అయిపోవడం, ఏపీకి వచ్చేందుకు సరైన అనుకూల పరిస్థితులు లేకపోవడం, వంటి కారణాలతో లోకేష్ ఏపీలో చాలాకాలంగా అడుగు పెట్టలేదు.

TeluguStop.com - లోకేష్ దూకుడుతో టీడీపీ లో వచ్చిన మార్పులేంటి -Political-Telugu Tollywood Photo Image

దీంతో వైసిపి లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చింది.తాజాగా లోకేష్ అమరావతి పర్యటనలో పాల్గొంటూ, ఉద్యమానికి మరింత ఊతం ఇస్తూ, పార్టీ నాయకులకు భరోసా ఇచ్చే విధంగా వ్యవహరిస్తుండడం, అలాగే పార్టీ పదవుల విషయమై నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, టీడీపీ భవిష్యత్తు పై బెంగ వదిలేయాలని, త్వరలోనే మనం అధికారంలోకి రాబోతున్నాం అంటూ, భరోసా ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు.

ఈ వ్యవహారాల కారణంగా కొద్ది రోజులుగా టిడిపిలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.చంద్రబాబు స్థాయిలో లోకేష్ రాజకీయం చేస్తున్నట్లు, పార్టీపై పట్టు పెంచుకుంటున్నట్టుగా ఆయన వ్యవహారం కనిపిస్తోంది.

ఇప్పటి వరకు తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టే విధంగా, మరింత దూకుడుగా ఏపీ ప్రభుత్వం వైఫల్యాలపై పోరాటం చేస్తూ, అదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, లోకేష్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.ఈ విధంగా చేయడం ద్వారా, తన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేకుండా చేసుకునేందుకు, అనవసర విమర్శలకు చెక్ పెట్టేందుకు లోకేష్ కృషి చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు.

#AP Government #Nara Lokesh #Ysrcp #Jagan #TDP Leaders

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Leaders More Active On Lokesh Ap Tour Related Telugu News,Photos/Pics,Images..