అలాంటి కామెంట్లు చేస్తున్న టీడీపీ నేత‌లు.. భారీ మూల్యం త‌ప్ప‌దా..?

ప్ర‌జాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స‌రే లేదంటే ప్ర‌తిప‌క్షంలో ఉన్నా స‌రే విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్న‌ట్టు ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తేనే ఆద‌రిస్తారు.కాద‌ని క‌క్ష పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం విమ‌ర్శ‌లు, వ్య‌తిరేక‌త త‌ప్ప‌వు.

 Tdp Leaders Making Such Comments On The Ycp Government, Tdp Leaders, Chandrababu, Comments On Ycp Government, Ap Cm Jagan,chandrababu Naidu Comments, Ycp Leaders, Tdp, Ycp, Pattabhi, Ap Politics, Tdp Vs Ycp-TeluguStop.com

ఈ మాట ఇప్ప‌టికే ఏపీ పార్టీల‌కు అర్థ‌మ‌యిపోయి ఉంటుంది.కానీ ఎందుకో మ‌ళ్లీ అలాంటి స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇరు పార్టీలు కూడా.

ఇప్ప‌టికే టీడీపీ అధికారం కోల్పోయి ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది.అయితే తాము అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీని టార్గెట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్ టీడీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్నార‌నే ప్ర‌చారం జరుగుతోంది.

 TDP Leaders Making Such Comments On The Ycp Government, TDP Leaders, Chandrababu, Comments On Ycp Government, Ap Cm Jagan,chandrababu Naidu Comments, Ycp Leaders, Tdp, Ycp, Pattabhi, Ap Politics, Tdp Vs Ycp-అలాంటి కామెంట్లు చేస్తున్న టీడీపీ నేత‌లు.. భారీ మూల్యం త‌ప్ప‌దా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార‌ణాలు ఏమైనా కూడా ఇలా ఒక‌రిని ఒక‌రు టార్గెట్ చేసుకుంటూ ప్ర‌జ‌ల్లో చుల‌క‌న అయిపోతున్నారు.అయితే ఇక్క‌డ చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత కూడా తాము గెలిస్తే వైసీపీ నేతల‌కు వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చెప్ప‌డం విడ్డూరంగా ఉంది.

ఎందుకంటే ఇలాంటి కామెంట్లు చేస్తే ప్ర‌జ‌ల్లో అధికారం అనేది క‌క్ష తీర్చుకోవ‌డం కోస‌మే గానీ ప్ర‌జ‌ల‌కు అభివృద్ధి చేయ‌డం కోసం మాత్రం కాదనే అభిప్రాయం ఏర్ప‌డుతుంది.అలాంట‌ప్పుడు దాన్ని ప్ర‌త్య‌ర్థులు అవ‌కాశంగా మార్చుకుని వ్య‌తిరేక‌త తీసుకొచ్చే ప్ర‌మాదం కూడా ఉంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ycp, Pattabhi, Tdp, Tdp Ycp-Telugu Political News

కానీ చంద్ర‌బాబు మాత్రం దీన్ని మ‌ర్చిపోతున్నారు.వైసీపీ నేత‌లు ద‌య మీద చేస్తున్న అరాచకాల‌కు ఇంత‌కు ఇంత బ‌దులు తీర్చుకుంటామ‌ని ఎవరు ఎన్ని తప్పులు చేశార‌నేది త‌మ ద‌గ్గ‌ర చిట్టా ఉందంటూ బ‌హిరంగంగానే చెప్పేస్తున్నారు.ఈ కామెంట్లు టీడీపీ క్యాడర్ కు ఉత్సాహం ఇస్తాయి కావ‌చ్చు గానీ అంతిమంగా ప్ర‌జ‌ల్లో మాత్రం వ్య‌తిరేక‌త తీసుకొస్తాయ‌ని మ‌ర్చిపోతున్నారు.దీన్నే అటు వైసీపీ త‌మ‌కు అవ‌కాశంగా మ‌లుచుకుంటోంది.

ఏదేమైనా కూడా టీడీపీ నేత‌లు ఏదైనా ఉంటే ఇలా అధికారంలోకి రాక‌ముందే చెప్ప‌డం మంచిది కాదంటున్నారు విశ్లేష‌కులు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube