పవన్ పైనే తమ్ముళ్ల భారం !  డిసైడ్ అయిపోయారుగా ?

తెలుగుదేశం పార్టీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.ఎప్పుడయితే ఏపీలో జనసేన ప్రభంజనం కనిపించడం మొదలయ్యిందో , అప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహారాలపై తెలుగు తమ్ముళ్లు దృష్టిపెట్టారు.

 Tdp Leaders Hopes On Pavan Kalyan Support, Janasena,pavan Kalyan, Tdp, Chandraba-TeluguStop.com

గతం తో పోలిస్తే జనసేన బాగా బలోపేతం అవ్వడం, భవిష్యత్ లో ఆ పార్టీ ప్రభంజనం ఎక్కువగా ఉండేలా కనిపిస్తూ ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో ఆ పార్టీ పై అందరి దృష్టి పడింది.వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి ప్రభుత్వం పై ఎన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నా, ఎన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా , ఆశించిన స్థాయిలో అయితే ప్రయోజనం కనిపించడం లేదు.

దీంతో టీడీపి ఉసూరుమనాల్సిన పరిస్థితి నెలకొంది.

 దీంతో 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా జనసేన మద్దతు ఉండాల్సిందే అని, పవన్ ఆదుకుంటే తప్ప తెలుగుదేశం పరిస్థితి మెరుగు అవ్వదు అనే అభిప్రాయానికి తెలుగు తమ్ముళ్లు వచ్చేశారు.

వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు.అలా పోటీ చేసినా,  2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు అయింది.  అయితే అప్పట్లో అమరావతి , పోలవరం ఇవన్నీ ఆదుకుంటామని చంద్రబాబు ధీమాకు వెళ్లడం తోనే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలు అయ్యింది.
 

Telugu Ap, Chandrababu, Janasena, Janasenatdp, Pavan Kalyan, Tdpjanasena, Tdp-Te

 ఇప్పుడు మళ్లీ టిడిపి అధికారంలోకి రావాలి అంటే తప్పనిసరిగా జనసేన సహకారం ఉండాలని, అప్పుడే మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ టిడిపి నాయకులు అభిప్రాయ పడుతున్నారు.పవన్ వస్తే తప్ప టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్స్ లేదనే అభిప్రాయానికి టిడిపి నాయకులు వచ్చేశారు.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబుపై ఈ మేరకు టిడిపి నాయకులు ఒత్తిడి పెంచుతున్నారట.

  అయితే పవన్ మాత్రం ఇంకా టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో వేచి చూసే ధోరణి తో ఉండడంతో తెలుగు తమ్ముళ్లలో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube