టీడీపీలో ఈ ‘ రేటింగ్ ‘ సందడి ఏంటి ?  

TDP leaders hilet on party rating issue TDP, YSRCP, Jagan, Chandrababu Naidu, Nara Lokesh, TDP Party Leaders, Ap, YSRCP Governament - Telugu Amaravathi, Ap, Capital, Chandrababu, Government, Kamma, Lokesh, Mla, Tdp, Ysrcp

తెలుగుదేశం పార్టీలో ‘ రేటింగ్ ‘ అనే కొత్త పదం వినిపిస్తోంది.నాయకుల మధ్య ఈ రేటింగ్ అంశం ప్రస్తావనకు వస్తుంది.

TeluguStop.com - Tdp Leaders Hilet On Party Rating Issue

టీడీపీకి చెందిన ఒక సామాజిక వర్గం నాయకులు ఎక్కువగా ఈ రేటింగ్ అంశాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు.గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత పెరిగిందని, గతంకంటే తెలుగుదేశం మరింత బలపడింది అంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారు.

ముఖ్యంగా బాబు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఈ ప్రచారం జోరందుకుంది.అయితే ఆకస్మాత్తుగా టిడిపిలో ఈ ప్రచారం జోరు అందుకోవడం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికి అంతు పట్టడం లేదు.

TeluguStop.com - టీడీపీలో ఈ రేటింగ్ సందడి ఏంటి -Political-Telugu Tollywood Photo Image

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో టిడిపిలో నిరాశ నిస్పృహలు కనిపించేవి.

నాలుగు నెలల క్రితం వరకు అదే పరిస్థితి కొనసాగింది.

అయితే అకస్మాత్తుగా టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ ఎత్తుగడలను ఉపయోగించి వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ,  ఎదురుదెబ్బలు తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో, టిడిపిలో రేటింగ్  పెరిగినట్టుగా కనిపిస్తోంది.ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పైన, అందులోని లోపల పైన టిడిపి అది నాయకుడు చంద్రబాబు దృష్టి సారించి, ప్రజల్లోకి తీసుకు వెళ్లడం , కోర్టుల ద్వారా పోరాడుతూ ఉండడం వంటి కారణాలతో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్లలేక పోతోంది.

చంద్రబాబు రాజకీయ వ్యూహాలను తట్టుకోవడం వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.

మొన్నటి వరకు ఇంటికే పరిమితమై పోయిన లోకేష్ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వస్తుండడం, ఇవన్నీ టిడిపి కి బాగా కలిసి వస్తున్నాయి.

ప్రస్తుతం గతంతో పోలిస్తే టిడిపి రేటింగ్ బాగా పెరిగిందని , బాగా పుంజుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.ఈ వ్యవహారాలన్నీ టిడిపిలో కాస్త ఊపు తీసుకొస్తున్నాయి.

ఇప్పటికే పెద్ద ఎత్తున నాయకులు వైసీపీ బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఎవరు చేజారిపోకుండా, బాబు పార్టీ బలం పుంజుకునే విధంగా చేయగలిగారు.ఇప్పుడు పార్టీ మారాలనుకునే నాయకుల్లోనూ, కాస్త మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారాలను బట్టి ఇప్పుడు టిడిపి రేటింగ్ అంశంపై ఆ పార్టీ నాయకులు కొంతమంది ప్రచారాన్ని ఉధృతం చేశారు.

#Government #Kamma #Chandrababu #Capital #Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tdp Leaders Hilet On Party Rating Issue Related Telugu News,Photos/Pics,Images..